Deaf Olympics: అభినవ్‌కు స్వర్ణం
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:57 AM
బధిర ఒలింపిక్స్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. తాజాగా పిస్టల్ విభాగంలో అభినవ్ దేశ్వాల్ స్వర్ణంతో మెరిశాడు. ఈ ఒలింపిక్స్ షూటింగ్ అంశంలో...
బధిర ఒలింపిక్స్
టోక్యో: బధిర ఒలింపిక్స్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. తాజాగా పిస్టల్ విభాగంలో అభినవ్ దేశ్వాల్ స్వర్ణంతో మెరిశాడు. ఈ ఒలింపిక్స్ షూటింగ్ అంశంలో భారత్‌కిది 15వ పతకం. ఆదివారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో అభినవ్ 44 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. కొరియా షూటర్ సెంగ్ రజతం, ఉక్రెయిన్‌కు చెందిన సెర్హీ కాంస్యం దక్కించుకొన్నారు. అయితే, క్వాలిఫికేషన్ రౌండ్‌లో అభినవ్ 575 పాయింట్లతో డెఫిలింపిక్స్ క్రీడల రికార్డు నెలకొల్పాడు.
ఇవీ చదవండి:
అంధ మహిళల టీ20 ప్రపంచకప్ భారత్‌దే.. జట్టుపై అభినందనలు..
ఊహించని పరిణామం.. స్మృతి మంధాన పెళ్లి వాయిదా..