World Records: అబ్బురపర్చిన నిర్వి
ABN , Publish Date - Jul 11 , 2025 | 01:55 AM
ఎనిమిదేళ్ల నిర్వి ప్రద్యుమ్న అత్యంత పిన్న వయసులో రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. గురువారం కూకట్‌పల్లిలో నిర్వి ఈ రెండు ప్రపంచ రికార్డులకు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఎనిమిదేళ్ల నిర్వి ప్రద్యుమ్న అత్యంత పిన్న వయసులో రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. గురువారం కూకట్‌పల్లిలో నిర్వి ఈ రెండు ప్రపంచ రికార్డులకు యత్నించింది. 50కి పైగా చెస్ ఓపెనింగ్ ట్రాప్స్‌ను 50కి పైగా బోర్డులపై కేవలం 30 నిమిషాల్లోనే పూర్తి చేసి అతి తక్కువ సమయంలో పిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది. తదనంతరం 195 దేశాల అధికారిక కరెన్సీను కేవలం 4 నిమిషాల 26 సెకన్లలో గుర్తించి, పేర్లు చెప్పింది. ఈ రెండు రికార్డులను లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సుకు పోటీల నిర్వాహకులు పంపించారు. మూడ్రోజుల్లో ఈ రికార్డులను అధికారికంగా వెల్లడించనున్నారు.
ఇవి కూడా చదవండి
ఇన్కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి