Indian Wrestling: 11 మంది రెజ్లర్లపై వేటు
ABN , Publish Date - Aug 08 , 2025 | 03:06 AM
నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన 11 మంది రెజ్లర్లను..భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) సస్పెండ్ చేసింది. రెజ్లింగ్ క్రీడకు హరియాణా ప్రసిద్ధి చెందినది. దాంతో ఆ రాష్ట్ర జట్టులో ఎంపికకు పోటీ తీవ్రంగా...
నకిలీ జనన ధ్రువీకరణ పత్రాల గుట్టు రట్టు
న్యూఢిల్లీ : నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన 11 మంది రెజ్లర్లను..భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) సస్పెండ్ చేసింది. రెజ్లింగ్ క్రీడకు హరియాణా ప్రసిద్ధి చెందినది. దాంతో ఆ రాష్ట్ర జట్టులో ఎంపికకు పోటీ తీవ్రంగా ఉండడంతో పలువురు ఢిల్లీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈక్రమంలో వారు ఢిల్లీలో జన్మించినట్టు నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. వీటిపై అనుమానం వచ్చిన డబ్ల్యూఎ్‌ఫఐ విచారణ చేయాల్సిందిగా ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ను కోరింది. దర్యాప్తు జరిపిన కార్పొరేషన్ 11 మంది రెజ్లర్ల జనన ధ్రువీకరణ పత్రాలు తాము జారీ చేయలేదని తేల్చింది. దాంతో సాక్షమ్, మనుజ్, కవిత, అన్షు, ఆరుష్ రాణా, శుభమ్, గౌతమ్, జగ్‌రూప్ ధన్కడ్, నకుల్, దుష్యంత్, సిద్ధార్థ బలియాన్ అనే రెజ్లర్లపై డబ్ల్యూఎ్‌ఫఐ వేటు వేసింది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి