Share News

ఆ రోడ్డుపై గీతలు.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి..

ABN , Publish Date - Oct 19 , 2025 | 01:54 PM

రోడ్లపై వాహనాలకు దిశా నిర్దేశనం చేసే గీతలు నిలువుగా ఉంటాయి. పాదచారులు రోడ్డు దాటేందుకు, సెంటర్లలో అడ్డంగా కూడా చూస్తుంటాం. కానీ అమెరికాలోని మోంట్గోమేరీ టౌన్‌షిప్‌లో రోడ్డు మీద కొన్ని చోట్ల తెలుపు, పసుపు రంగు గీతలు అడ్డదిడ్డంగా కనిపిస్తాయి. ఇప్పుడు అవే అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఆ రోడ్డుపై గీతలు.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి..

రోడ్లపై వాహనాలకు దిశా నిర్దేశనం చేసే గీతలు నిలువుగా ఉంటాయి. పాదచారులు రోడ్డు దాటేందుకు, సెంటర్లలో అడ్డంగా కూడా చూస్తుంటాం. కానీ అమెరికాలోని మోంట్గోమేరీ టౌన్‌షిప్‌లో రోడ్డు మీద కొన్ని చోట్ల తెలుపు, పసుపు రంగు గీతలు అడ్డదిడ్డంగా కనిపిస్తాయి. ఇప్పుడు అవే అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఒకప్పుడు అక్కడి రోడ్ల మీద చాలామంది వాహనదారులు అతివేగంగా దూసుకుపోయేవారు. దాంతో స్థానికులకు ఇబ్బందిగా మారడమేగాక, ప్రతీరోజూ యాక్సిడెంట్లు జరిగేవి. టౌన్‌షిప్‌ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాహనాల వేగాన్ని నియంత్రించలేకపోయారు. ఎట్టకేలకు ఒక సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు.

రహదారుల మీద గీతలను నిలువుగా కాకుండా జిగ్‌జాగ్‌గా వేయించారు. రోడ్డు పక్కనే ‘కొత్త ట్రాఫిక్‌ విధానం’ అని అందరికీ అర్థమయ్యేలా బోర్డు ఏర్పాటు చేశారు. దాంతో వాహనదారులు అక్కడికి రాగానే బోర్డు చూసి, నెమ్మదించడం మొదలెట్టారు. ఆ దారిలో వెళ్లే కొత్తవారు కూడా సదరు వంకర టింకర గీతల వెంబడి నిదానంగా వాహనాన్ని డ్రైవ్‌ చేయడం మొదలెట్టారట. అలా కొద్ది రోజుల్లోనే వాహనాల వేగనియంత్రణతో పాటు, ప్రమాదాల సంఖ్య తగ్గింది. టౌన్‌షిప్‌ అధికారులు ఈ వినూత్న ఆలోచనను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. ‘ఐడియా అదుర్స్‌’ అంటూ నెటిజన్లు వారి ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు.

Updated Date - Oct 19 , 2025 | 01:54 PM