Karma Will Take Care: పేదవాడిని మోసం చేస్తావా?.. కర్మ అనుభవిస్తావు..
ABN , Publish Date - Nov 11 , 2025 | 03:15 PM
రైలు ప్రయాణికుడు ఒకడు చిరు వ్యాపారిని మోసం చేశాడు. పూర్తి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టాడు. రైలు వెంట పరుగులు పెట్టించాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మనం చేసే మంచి, చెడులను బట్టే కర్మ ఫలితం ఉంటుంది. కొంచెం లేటయినా సరే కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు కర్మ గురించే మాట్లాడుతున్నారు. నిరుపేద వ్యాపారిని మోసం చేసిన ఆ వ్యక్తి కచ్చితంగా కర్మ అనుభవించి తీరతాడంటున్నారు. ఆ వ్యక్తి ఏం చేశాడు?.. వ్యాపారిని ఎలా మోసం చేశాడు? నెటిజన్లు ఇంకా ఏమంటున్నారో తెలుసుకోవాలంటే ఈ మొత్తం స్టోరీ చదవాల్సిందే. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఉత్తర భారత దేశానికి చెందిన ఓ యువకుడు రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్‌పై సమోసాలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఓ రైలు అతడు సమోసాలు అమ్ముతున్న ప్లాట్ మీద ఆగింది. ఓ ప్రయాణికుడు రైలు కదులుతున్న సమయంలో సమోసాలు కొన్నాడు. డబ్బులు ఇవ్వకుండా యువకుడితో గొడవ పెట్టుకున్నాడు. రైలు ముందుకు కదిలింది. అయినా ఆ వ్యక్తి మాత్రం డబ్బులు ఇవ్వలేదు. రైలు మెల్లగా పరుగులు పెడుతూ ఉంది. యువకుడు రైలు వెంట పరిగెడుతూ ఆ ప్రయాణికుడిని డబ్బులు అడుగుతూ ఉన్నాడు.
అప్పుడు ఇవ్వాల్సిన దానికంటే తక్కువ డబ్బులు ఇచ్చాడు. పాపం ఆ యువకుడు పూర్తి డబ్బులు ఇవ్వమని బ్రతిమాలుతూ రైలు వెంటపడ్డాడు. అయినా ఆ ప్రయాణికుడు మిగిలిన డబ్బులు ఇవ్వలేదు. రైలు వేగంగా అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ యువకుడు బాధతో ప్లాట్ ఫామ్‌పై కూర్చుండిపోయాడు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘కర్మ నిన్ను వదిలిపెట్టదు. శిక్ష అనుభవిస్తావు’..‘ఈ వీడియోను చూసి నా గుండె పగిలిపోయింది. ఇలా ఎప్పుడూ చేయకండి’..‘ఎవరైనా రైలు ఆపి ఆ ప్రయాణికుడ్ని పోలీసులకు పట్టించాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అల్లం నీరు తాగితే నిజంగా బరువు తగ్గుతారా?
అందెశ్రీని పద్మశ్రీతో గౌరవించడానికి కృషి చేద్దాం: సీఎం రేవంత్‌రెడ్డి