Jugaad video: ఇతడి తెలివికి సలాం కొట్టాల్సిందే.. ఏసీ అవసరం లేకుండా ఎలా ప్లాన్ చేశాడో చూడండి..
ABN , Publish Date - May 19 , 2025 | 06:25 PM
ప్రస్తుత వేసవిలో ఎండ మండించేస్తోంది. అందరికీ ఏసీలు కొనుక్కునే స్థోమత ఉండదు. దీంతో కొందరు తమ తెలివితేటలను ఉపయోగించి ఏసీ లాంటి చల్లదనాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది.
మన దేశంలో చాలా మంది సాధారణ వ్యక్తులు కూడా అద్భుతమైన తెలివితేటలను ప్రదర్శిస్తుంటారు. పెద్దగా ఖర్చు పెట్టనవసరం లేకుండా సునాయసంగా పనులు పూర్తి చేస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుత వేసవి (Summar)లో ఎండ మండించేస్తోంది. అందరికీ ఏసీ (AC)లు కొనుక్కునే స్థోమత ఉండదు. దీంతో కొందరు తమ తెలివితేటలను ఉపయోగించి ఏసీ లాంటి చల్లదనాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది (Viral Video).
@Anshika_ya అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఆరుబయట మంచం వేసుకుని పడుకున్నాడు. అతడి ఎదురుగా టేబుల్ ఫ్యాన్ ఉంది. ఆ టేబుల్ ఫ్యాన్ నుంచి అతడి తల వరకు ఓ పెద్ద ప్లాస్టిక్ కవర్ ఉంది. ఆ ఫ్యాన్ నుంచి వచ్చే గాలి అటూ ఇటూ కాకుండా పూర్తిగా అతడికి మాత్రమే తగులుతోంది. దీంతో అతడు చల్లగా నిద్రపోతున్నాడు. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల మంది వీక్షించారు. కొన్ని వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఈ టెక్నాలజీ ఇండియా దాటి బయటకు వెళ్లకూడదని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక, ఆ వ్యక్తి తెలివితేటలను ప్రశంసిస్తూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..