Share News

Woman Slaps Journalist: జర్నలిస్ట్‌పై రెచ్చిపోయిన మహిళ.. చెప్పుతో చావు దెబ్బలు..

ABN , Publish Date - Nov 10 , 2025 | 12:18 PM

ఓ మహిళ న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్ట్‌పై దాడి చేసింది. విచక్షణా రహితంగా అతడ్ని కొట్టింది. దాడి దృశ్యాలను వీడియో తీసి బెదిరింపులకు సైతం దిగింది.

Woman Slaps Journalist: జర్నలిస్ట్‌పై రెచ్చిపోయిన మహిళ.. చెప్పుతో చావు దెబ్బలు..
Woman Slaps Journalist

న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్ట్‌కు దారుణమైన అనుభవం ఎదురైంది. ఓ మహిళ అతడిపై చెప్పుతో దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టింది. బూతులతో రెచ్చిపోయింది. బెదిరింపులకు సైతం దిగింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత జర్నలిస్ట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. ఫిరోజ్‌పూర్‌కు చెందిన రాహుల్ ఉపాధ్యాయ స్థానిక మీడియా సంస్థలో రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. అతడు శుక్రవారం రాత్రి న్యూస్ కవర్ చేయడానికి సుభాష్ తిరహ ప్రాంతానికి వెళ్లాడు.


న్యూస్ కవర్ చేస్తున్న సమయంలో నాలుగు నుంచి ఐదుగురు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. ఈ దాడినంతా వీడియో తీయటం మొదలెట్టారు. ముస్కాన్ అనే మహిళ రెచ్చిపోయి ప్రవర్తించింది. రాహుల్ ఫోన్‌ను ధ్వంసం చేసింది. అంతటితో ఆగకుండా అతడిపై చెప్పుతో విచక్షణా రహితంగా దాడి చేసింది. దాదాపు ఏడు సార్లు చెప్పుతో ముఖంపై కొట్టింది. దాడి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని, అలా చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ముస్కాన్, ముస్కాన్ భర్త బెదిరింపులకు దిగారు.


50 వేల రూపాయలు అడిగారు. ఈ దాడిపై రాహుల్ పోలీసులను ఆశ్రయించాడు. ముస్కాన్‌తో పాటు మరికొంతమందిపై ఫిర్యాదు చేశాడు. ముస్కాన్, ఆమె భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. అయితే, పోలీస్ కేసు నేపథ్యంలో ముస్కాన్ కుటుంబసభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తమ వారిపై తప్పుడు కేసు పెట్టారంటూ నిరసనలు తెలిపారు. పోలీసులు రాహుల్‌కు సానుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.


ఇవి కూడా చదవండి

అందెశ్రీ మృతిపై తెలంగాణ మంత్రుల సంతాపం

అది సామ్రాజ్యవాద ధోరణి.. ట్రంప్‌పై దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆగ్రహం..

Updated Date - Nov 10 , 2025 | 12:24 PM