Unique golgappa rule: అబ్బాయిలు ఏం పాపం చేశారన్నా.. పానీపూరీవాలా పెట్టిన రూల్ చూడండి..
ABN , Publish Date - Dec 12 , 2025 | 01:50 PM
మనదేశంలోని ఓ మోస్తరు గ్రామాల్లో కూడా పానీపూరీ విక్రేతలు కనిపిస్తారు. దాదాపు అన్ని స్టాళ్లూ రద్దీగాగా ఉంటాయి. సాధారణంగా పానీపూరీలను అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఇష్టపడతారు. తాజాగా ఒక పానీపూరీ విక్రేతకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మనదేశంలో చాలా మందికి పానీపూరీ ఫేవరెట్ స్నాక్. భారతీయులు పానీపూరీలను ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనదేశంలోని ఓ మోస్తరు గ్రామాల్లో కూడా పానీపూరీ విక్రేతలు కనిపిస్తారు. దాదాపు అన్ని స్టాళ్లూ రద్దీగాగా ఉంటాయి. సాధారణంగా పానీపూరీలను అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఇష్టపడతారు. తాజాగా ఒక పానీపూరీ విక్రేతకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (smart golgappa seller).
@gharkekalesh అనే ఎక్స్ యూజర్ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కాలేజ్ వెలుపల ఓ పానీపూరీ స్టాల్ ఉంది. దాని చుట్టూ అమ్మాయిల గుంపు ఉంది. ఆ స్టాల్ పైన 'అబ్బాయిలకు ప్రవేశం లేదు' అంటూ బోర్డ్ కూడా ఏర్పాటు చేశారు. అబ్బాయిల గోల లేకుండా అమ్మాయిలు మాత్రమే అక్కడ పానీపూరీని హాయిగా ఆస్వాదించవచ్చు. ఈ మార్కెటింగ్ ట్రిక్‌తో ఆ స్టాల్‌కు గిరాకీ బాగా పెరిగిందట. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (golgappa seller ban boys).
ఆ వైరల్ వీడియోను లక్షల మంది వీక్షించి, వేల మంది లైక్ చేశారు (only girls allowed viral story). ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ఇది అదిరిపోయే మార్కెటింగ్ ట్రిక్ అని ఒకరు కామెంట్ చేశారు. అమ్మాయిల భద్రత గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలని మరొకరు ప్రశంసించారు. ఇది అబ్బాయిలపై వివక్ష అంటూ మరొకరు పేర్కొన్నారు.