Tiny pocket in jeans: జీన్స్ ప్యాంట్‌కు ఈ చిన్న జేబు ఎందుకుంటుంది.. మీకు తెలుసా..
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:04 PM
జీన్స్ ప్యాంట్ కుడి వైపు జేబుపై మరో చిన్న జేబు ఉండడాన్ని అందరూ చూసే ఉంటారు. అయితే ఆ జేబు ఎందుకుంటుంది? దాని వల్ల ఉపయోగం ఏంటి? ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ప్రస్తుతం అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా వయసుతో కూడా సంబంధం లేకుండా అందరూ జీన్స్ ప్యాంట్ వేసుకుంటున్నారు. జీన్స్ ప్యాంట్ అనేది స్టైల్ స్టేట్‌మెంట్‌లా మారిపోయింది. జీన్స్ ప్యాంట్ కుడి వైపు జేబుపై మరో చిన్న జేబు ఉండడాన్ని అందరూ చూసే ఉంటారు. అయితే ఆ జేబు ఎందుకుంటుంది? దాని వల్ల ఉపయోగం ఏంటి? ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (jeans small pocket purpose).
నిజానికి ఆ చిన్న జేబు వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అందులో ఏమీ పెట్టుకోవడానికి కుదరదు. కానీ, అన్ని జీన్స్ ప్యాంట్‌లకు ఆ చిన్న జేబు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. దాని వెనుక ఓ ఆసక్తికర కారణం ఉందట. జీన్స్ ప్యాంట్‌లను మొదట 19వ శతాబ్దంలో తయారు చేశారు. ఆ సమయానికి చేతి గడియారాలు అంతగా ప్రాచుర్యం పొందలేదు. అందరి దగ్గరా ఉండేవి కావు. కానీ, చిన్న పాకెట్ గడియారాలను మాత్రం అందరూ తమతో పాటు తీసుకెళ్లేవారట. అలాంటి గడియారాల కోసమే ఈ పాకెట్‌ను పెట్టేవారట (jeans design facts).
ఆ తర్వాత పాకెట్ గడియారాలు పోయి, చేతి గడియారాలు వచ్చేసినప్పటికీ జీన్స్ ప్యాంట్ తయారీదారులు మాత్రం కుడివైపు ఆ చిన్న జేబును మాత్రం అలాగే ఉంచేశారు (denim pocket history). ఆ చిన్న జేబు జీన్స్ ప్యాంట్ డిజైన్‌లో ఓ భాగంగా మారిపోయింది. ఓ స్టైల్ స్టేట్‌మెంట్ అయిపోయింది. ఇదీ జీన్స్ ప్యాంట్ కుడివైపు ఉండే ఆ చిన్న జేబు కథ.
ఇవి కూడా చదవండి..
మీ కళ్లకు టెస్ట్.. ఈ ఫొటోలో కొండచిలువ ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..
వామ్మో.. లవర్‌కు ఇలాంటి గిఫ్ట్ ఎవరైనా ఇస్తారా.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
మరిన్ని వైరల్ వార్తలు కోసం క్లిక్ చేయండి..