Princess Diana: ప్రిన్సెస్ డయానా మృతి.. 28 ఏళ్ల క్రితం ఇదే రోజున అసలేం జరిగింది..
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:44 PM
ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుని, ఎంతో మంది మన్ననలు అందుకున్న వేల్స్ యువరాణి డయానా మరణం ఇప్పటికీ ఎంతో మందిని బాధిస్తూనే ఉంటుంది. ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం 1997 ఆగస్టు 31 తెల్లవారుజామున పారిస్‌లోని పాంట్ డి ఎల్'అల్మా సొరంగంలో జరిగిన కారు ప్రమాదంలో డయానా మరణించారు.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుని, ఎంతో మంది మన్ననలు అందుకున్న వేల్స్ యువరాణి డయానా (Princess Diana) మరణం ఇప్పటికీ ఎంతో మందిని బాధిస్తూనే ఉంటుంది. ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం 1997 ఆగస్టు 31 తెల్లవారుజామున పారిస్‌లోని పాంట్ డి ఎల్'అల్మా సొరంగంలో జరిగిన కారు ప్రమాదంలో డయానా మరణించారు (Paris tunnel crash). అప్పటికి ఆమె వయసు కేవలం 36 సంవత్సరాలు మాత్రమే. ఆగస్ట్ 30వ తేదీ రాత్రి పారిస్‌లోని రిట్జ్ హోటల్‌లో భోజనం తర్వాత డయానా, తన భాగస్వామి డోడి ఫయేద్‌తో కలిసి బయల్దేరారు (Diana death anniversary).
రిట్జ్ హోటల్ బయట ఫొటోగ్రాఫర్లు, మీడియా ప్రతినిధులు భారీగా ఉన్నరానే కారణంతో హోటల్ వెనుక ద్వారా గుండా బయటకు వచ్చి కారు ఎక్కి వెళ్లిపోయారు. ఆ క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంలో డయానాతో పాటు ఆమె భాగస్వామి డోడి ఫయేద్, కార్ డ్రైవర్ హెన్రీ పాల్ చనిపోయారు. డోడి అంగరక్షకుడు ట్రెవర్ రీస్-జోన్స్ తీవ్రంగా గాయపడ్డాడు (Diana car crash). ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి అతనే. అయితే ఈ ప్రమాదంపై ఆ తర్వాత జరిగిన దర్యాప్తు ఇప్పటికీ పలు అనుమానాలను రేకెత్తిస్తూనే ఉంది. డ్రైవర్ హెన్రీ పాల్ మద్యం, మాదక ద్రవ్యాల మత్తులో ఉన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని దర్యాఫ్తు వెల్లడించింది. అయితే ఇప్పటికీ ఆ దర్యాఫ్తును చాలా మంది ప్రశ్నిస్తూనే ఉన్నారు (royal tragedy).
డయానా కెమెరాల వెలుగులోనే జీవించి, కెమెరాల నుంచి తప్పించుకునే క్రమంలోనే మరణించారు. ఆమె ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ మహిళగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఎయిడ్స్ రోగులు, ల్యాండ్‌మైన్ బాధితుల కోసం ప్రచారం చేయడానికి తన హోదాను డయానా ఉపయోగించుకున్నారు. చేతులకు గ్లౌస్‌లు లేకుండా హెచ్‌ఐవీ రోగులతో కరచాలనం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అలాగే ప్రాణాలకు తెగించి మరీ మందుపాతరలతో నిండిన పొలాల గుండా నడిచారు. వారి రక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రపంచ నాయకులను డిమాండ్ చేశారు.
డయానా మరణించిన వార్త తెలిసి ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. కెన్సింగ్టన్ ప్యాలెస్ బయట, ప్రధాన ద్వారం కంటే ఎత్తులో పువ్వులు పేర్చి సంతాపం వ్యక్తం చేశారు. లండన్ వీధుల్లో లక్షలాది మంది బారులు తీరారు. ఎల్టన్ జాన్ పాట పాడుతుండగా, ఇద్దరు యువరాజులు తమ తల్లి శవపేటిక వెనుక నడిచారు. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది ఆమె అంత్యక్రియలను టెలివిజన్‌లో వీక్షించారని అంచనా.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఒంటెకు ఇంత కోపం వస్తుందా.. డిస్ట్రబ్ చేసిన కుర్రాళ్లను ఏం చేసిందో చూడండి..
మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలోని ఉడతను 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..