Cow Video: కుక్కలకే కాదు.. ఆవులకు కూడా ఇంత ప్రేమ ఉంటుందా? యజమానిని కాపాడేందుకు ఆవు ఏం చేసిందో చూడండి..
ABN , Publish Date - Jun 24 , 2025 | 07:38 PM
సాధారణంగా అందరూ కుక్కలను విశ్వాసానికి ప్రతీకగా భావిస్తాం. కుక్కలు తమ యజమానుల పట్ల విశ్వాసంగా ఉంటాయని అనుకుంటాం. అయితే కుక్కల తరహాలోనే ఆవులకు కూడా తమ యజమానుల మీద ప్రేమ ఉంటుందని ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో రుజువు చేస్తోంది.
సాధారణంగా మనం కుక్కలను విశ్వాసానికి ప్రతీకగా భావిస్తాం. కుక్కలు మాత్రమే తమ యజమానుల పట్ల విశ్వాసంగా ఉంటాయని అనుకుంటాం. అయితే కుక్కల తరహాలోనే ఆవులకు (Cow) కూడా తమ యజమానుల మీద ప్రేమ ఉంటుందని ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో రుజువు చేస్తోంది. ఆ వీడియోలో ఓ ఆవు తన యజమానిని (Owner) కాపాడేందుకు పరిగెత్తిన తీరు చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Cow runs to save her owner).
@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన ఆవుతో కలిసి ఓ మైదానంలో ఉన్నాడు. అక్కడ ఆ వ్యక్తి స్నేహితులు కొందరు సరదాగా ఆ ఆవును టెస్ట్ చేశారు. ఆ ఆవు యజమానిని పట్టుకుని కర్రలతో కొడుతున్నట్టు నటించారు. అది చూసిన ఆవు వెంటనే పరిగెత్తుకుంటూ తన యజమాని దగ్గరకు వెళ్లింది. తన కొమ్ములను ముందుకు వంచుతూ వేగంగా వారి వైపు దూసుకెళ్లింది. వారి పారిపోగానే తన యజమాని దగ్గర నిల్చుండిపోయింది.
ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 14 లక్షల మందికి పైగా వీక్షించారు. 45 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. జంతువులలోనే నిజమైన ప్రేమ కనబడుతుందని ఒకరు కామెంట్ చేశారు. ఆవులకు కూడా తమ యజమానులపై ఇంత ప్రేమ ఉంటుందా అని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్‌లో టీ కెటిల్‌ను ఎలా కడుగుతున్నాడో చూడండి.. వీడియో వైరల్..
షాకింగ్.. 52 ఏళ్లుగా కడుపులోనే టూత్‌బ్రష్.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..