Share News

Viral Video: ట్రైన్ పక్కన వీడియో చేయాలనుకుంది.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందో చూడండి..

ABN , Publish Date - May 20 , 2025 | 07:14 PM

చాలా మంది గంటలు గంటలు సామాజిక మాధ్యమాల్లోనే గడుపుతున్నారు. వారిని ఆకట్టుకునేందుకు కొందరు వ్యక్తులు రకరకాల వీడియోలు రూపొందిస్తున్నారు. ఎలాగైనా వైరల్ కావాలనే ఉద్దేశంతో విచిత్రమైన వీడియోలను రూపొందిస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని ప్రమాదాలకు కూడా గురవుతున్నారు.

Viral Video: ట్రైన్ పక్కన వీడియో చేయాలనుకుంది.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందో చూడండి..
Viral Video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది మొబైల్స్‌తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. గంటలు గంటలు సామాజిక మాధ్యమా (Social Media)ల్లోనే గడుపుతున్నారు. వారిని ఆకట్టుకునేందుకు కొందరు వ్యక్తులు రకరకాల వీడియోలు రూపొందిస్తున్నారు. ఎలాగైనా వైరల్ కావాలనే ఉద్దేశంతో విచిత్రమైన వీడియోలను రూపొందిస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.


laxmisaha1389 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువతి వేగంగా వెళ్తున్న రైలు (Train) పక్కన నిల్చుని వీడియో తీసుకునేందుకు ప్రయత్నించింది. వేగంగా వస్తున్న రైలు పక్కన నిల్చుంది. వీడియో తీసుకునేందుకు సిద్ధమవుతుండగా వేగంగా వచ్చిన రైలు ఆమెకు చుక్కలు చూపించింది. ఆ రైలు వేగం వచ్చిన గాలి ఆమెను పక్కకు తోసేసింది. ఆమె వెంటనే బయటకు వచ్చేయడంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది.


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. అలాంటి వీడియోలు తీయాలనుకుంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందేనని ఒకరు కామెంట్ చేశారు. ఆమె ఇకపై ఎప్పుడూ అలాంటి ప్రయత్నాలు చేయదని మరొకరు పేర్కొన్నారు.

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 20 , 2025 | 07:14 PM