Share News

Bull Video: వామ్మో.. బసవన్నకు అంత కోపం ఎందుకొచ్చింది? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే

ABN , Publish Date - May 27 , 2025 | 06:13 PM

సాధారణంగా బసవన్నలు రోడ్ల మీద ఎవరి జోలికీ వెళ్లకుండా నడుచుకుంటూ వెళ్లిపోతుంటాయి. అయితే వాటికి కోపం వస్తే మాత్రం పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bull Video: వామ్మో.. బసవన్నకు అంత కోపం ఎందుకొచ్చింది? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే
Bull Power

మనం చాలా సార్లు రోడ్ల మీద ఎద్దులు (Bull) ఫైట్ చేసుకోవడం చూసి ఉంటాం. సినిమాల్లో కూడా ఎద్దులను బలానికి ప్రతీకగా చూపిస్తుంటారు. అయితే ఎద్దులకు నిజంగా ఎంత బలం ఉంటుందో చూస్తే మాత్రం ఆశ్చర్యం వేయడం ఖాయం. సాధారణంగా బసవన్నలు రోడ్ల మీద ఎవరి జోలికీ వెళ్లకుండా నడుచుకుంటూ వెళ్లిపోతుంటాయి. అయితే వాటికి కోపం వస్తే మాత్రం పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


helo_ki_takar అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక ఎద్దు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో దానికి ఒక ట్రాక్టర్ (Tractor) ఎదురుగా వచ్చింది. ట్రాక్టర్ డ్రైవర్ మొదట ఆ ఎద్దును చూడగానే ఆపేశాడు. అయితే ఆ ఎద్దు పూర్తి శక్తితో ట్రాక్టర్ ఇంజిన్‌ను పైకి లేపేసింది. పూర్తిగా లోడ్ అయిన ఉన్న ఆ ట్రాక్టర్ ఆ ఎద్దు బలం కారణంగా వెనక్కి వెళ్లిపోయింది. ఆ దెబ్బకు డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి దిగి కిందకు వెళ్లిపోయాడు. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా మిలియన్ల మంది ఆ వీడియోను వీక్షించారు. లక్షల మంది ఆ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ఇది సినిమాలోని యాక్షన్ సన్నివేశాన్ని తలపిస్తోందని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ఎద్దుకు ఎంత బలం ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతోందని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Anaconda Video: అనకొండలతో నిండిపోయిన ఆ నదిని చూశారా.. అసలు సంగతేంటంటే


Picture Puzzle: మీ అబ్జర్వేషన్‌పై నమ్మకముంటే.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 25 సెకెన్లలో కనిపెట్టండి


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 27 , 2025 | 06:13 PM