Share News

Viral Video: ఇదెలా సాధ్యం అంకుల్.. ఇతడి తెలివి చూస్తే టెస్లా కంపెనీ వాళ్లే ఆశ్చర్యపోతారు..

ABN , Publish Date - Jul 09 , 2025 | 07:26 PM

కొంత మంది వ్యక్తులు తమ ట్యాలెంట్, క్రియేటివిటీతో మిగతా వారిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇతరులకు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారికి సంబంధించిన ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Viral Video: ఇదెలా సాధ్యం అంకుల్.. ఇతడి తెలివి చూస్తే టెస్లా కంపెనీ వాళ్లే ఆశ్చర్యపోతారు..
Jugaad Videos

కొంత మంది వ్యక్తులు తమ ట్యాలెంట్ (Talent), క్రియేటివిటీతో మిగతా వారిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇతరులకు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారికి సంబంధించిన ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి (Jugaad Videos). తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ మధ్య వయసు వ్యక్తి స్కూటీ (Scooty)ని నడుపుతున్న తీరు చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. హ్యాండిల్‌ను కనీసం టచ్ చేయకపోయినా ఆ స్కూటీ చక్కగా ముందుకు వెళ్లిపోతోంది.


filtercopy అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి బిజీ రోడ్డుపై హోండా యాక్టీవా స్కూటీ మీద వెళ్తున్నాడు. అయితే అతడు స్కూటీకి ఓ వైపునకు తిరిగి కూర్చున్నాడు. స్కూటీ హ్యాండిల్‌ పట్టుకోలేదు. కనీసం ముందు ఏమొస్తోందో కూడా చూడడం లేదు. అయినా ఆ స్కూటీ వేగంగా ముందుకు వెళ్లిపోతోంది. టెస్లా కంపెనీకి చెందిన ఆటో పైలెట్ మోడ్ కార్లలా తనే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటోంది. ఆ స్కూటీని అదే రోడ్డు మీద వెళ్తున్న ఓ బైకర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆ వీడియోను లక్షల మంది వీక్చించారు. 17 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇతడి కోసం టెస్లా మేనేజ్మెంట్ వెతుకుతోందని ఒకరు సరదాగా కామెంట్ చేశారు. హ్యాండిల్ ఎటూ తిరగకుండా అతడు ఏదో అమర్చి ఉంటాడని ఒకరు ఊహించారు. ఇది చాలా ప్రమాదకరం అని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

ఇదేం ఆత్రం బాబాయ్.. మద్యం షాప్‌నకు వెళ్లి అతడు చేసిన పని చూస్తే నవ్వకుండా ఉండలేరు..


ఈ ఫొటోలో పక్షిని కనిపెట్టగలిగితే.. మీ కళ్ల గురించి ఆలోచించనక్కర్లేదు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 09 , 2025 | 07:45 PM