Share News

Lions Fighting: అడవికి రాజైనా భార్యకు భయపడాల్సిందే.. మగ సింహం పరిస్థితి చూడండి..

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:12 PM

దేశానికి రాజు అయినా సరే భార్య ముందు సేవకుడిలా మారాల్సిందేనని చాలా మంది జోక్ చేస్తుంటారు. నిజానికి అది జోక్ మాత్రమే అనుకోలేం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మగ సింహాన్ని చూస్తే మగవారి పరిస్థితిపై జాలి పడాల్సిందే. ఆ వీడియోలో ఆడ సింహం కోపం చూసి మగ సింహం షాక్ అయింది.

Lions Fighting: అడవికి రాజైనా భార్యకు భయపడాల్సిందే.. మగ సింహం పరిస్థితి చూడండి..
Lioness fight with Lion

దేశానికి రాజు అయినా సరే భార్య ముందు సేవకుడిలా మారాల్సిందేనని చాలా మంది జోక్ చేస్తుంటారు. నిజానికి అది జోక్ మాత్రమే అనుకోలేం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మగ సింహాన్ని (Lion) చూస్తే మగవారి పరిస్థితిపై జాలి పడాల్సిందే. ఆ వీడియోలో ఆడ సింహం (Lioness) కోపం చూసి మగ సింహం షాక్ అయింది. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ సింహం రోడ్డు పక్కన ఉన్న గుహ నుంచి బయటకు రావడం కనిపిస్తోంది. మరుక్షణమే ఓ ఆడ సింహం కోపంగా ఆ మగ సింహంపై దాడి చేసింది. ఆ ఆడ సింహం చాలా కోపంగా ఉంది. ఆ మగసింహం షాక్‌తో నిస్సహాయంగా ఉండిపోయింది. ఆడ సింహాన్ని చూసి ఆ మగ సింహం భయపడుతుండడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత కాసేపటికి అక్కడి నుంచి మగ సింహం వెళ్లిపోవడానికి ప్రయత్నించింది.


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోను ఇప్పటివరకూ 9.2లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. లక్ష కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. దేవుడా.. ప్రతిచోటా నువ్వు భార్యకే ఎందుకు ఎక్కువ పవర్ ఇచ్చావని ఒకరు కామెంట్ చేశారు. 'అంతా ముగుస్తుంది, కానీ భార్యాభర్తల మధ్య గొడవ అంతం కాదు' అని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒకేసారి రెండు కప్పలను మింగిన పాము పరిస్థితి చూడండి..

ఈ మంచులో కుక్క ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెడితే.. మీ కళ్లకు తిరుగులేదు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 03 , 2025 | 05:35 PM