Shocking Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. అమెజాన్ అడవుల్లో అనకొండ ఎలా వెళ్తోందో చూశారా
ABN , Publish Date - May 12 , 2025 | 01:15 PM
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటే భయపడతారు. పాములున్నాయని తెలిస్తే అటు వైపు కూడా వెళ్లరు. ఇక, కొండచిలువలను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. ఇక, పాములలో అతి పెద్దవైన అనకొండ పేరు వింటే చాలు గుండెలు అదిరిపోతాయి.
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటే (Snakes) భయపడతారు. పాములున్నాయని తెలిస్తే అటు వైపు కూడా వెళ్లరు. ఇక, కొండచిలువలను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. ఇక, పాములలో అతి పెద్దవైన అనకొండ పేరు వింటే చాలు గుండెలు అదిరిపోతాయి. ఈ భూమి మీదే అతిపెద్ద అనకొండ (Anaconda)ను కొన్ని రోజుల క్రితం ఈక్వెడార్‌లో కనుగొన్నారు. తాజాగా అమెజాన్ అడవుల్లో (Amazon forest) మరో భారీ అనకొండ కనిపించింది.
అమెజాన్ అడవుల మధ్యనున్న నదిలో ఆ అనకొండ ఈదుకుంటూ వెళ్తోంది. @Sheetal2242 అనే మహిళ తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోను హెలీకాఫ్టర్ నుంచి చిత్రీకరించారు. అమెజాన్ అడవుల మధ్యనున్న నదిలో ఆ అనకొండ ఈదుకుంటూ వెళ్తోంది. దూరం నుంచే చూస్తుంటేనే ఆ అనకొండ చాలా భారీగా కనిపిస్తోంది. అది వేగంగా నీటిపై ఈదుకుంటూ వెళ్తోంది. దాని భారీ ఆకారాన్ని చూస్తే ఎంతటి వారైనా భయపడి తీరాల్సిందే.
ఆ వీడియోను చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 8.3 లక్షల మందికి పైగా వీక్షించారు. 13 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. అద్భుతమైన వీడియో అని ఒకరు, ఇది అత్యంత భారీ అనకొండలా ఉందని ఇంకొకరు, హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు ఉందని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వార్నీ.. డబ్బులు ఇలా కూడా సంపాదించవచ్చా.. ఈ కుర్రాళ్లు ఏం చేస్తున్నారో చూడండి
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..