Shark chewed a man: నడి సముద్రంలో షార్క్‌కు దొరికేశాడు.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..
ABN , Publish Date - Jul 20 , 2025 | 12:58 PM
సముద్రంలో షార్క్‌కు కనబడిన ఏ జంతువైనా తన ప్రాణం మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. షార్క్ వేట అత్యంత భయంకరంగా ఉంటుంది. తాజాగా అలాంటి ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సముద్రపు జీవులన్నింటిలోనూ షార్క్ (Shark) అత్యంత ప్రమాదకరమైనది. సముద్రంలో షార్క్‌కు కనబడిన ఏ జంతువైనా తన ప్రాణం మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. షార్క్ వేట అత్యంత భయంకరంగా ఉంటుంది. తాజాగా అలాంటి ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో (Viral Video) చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈజిప్టు (Egypt)లోని హుర్ఘడ తీరంలో ఈ వీడియోను చిత్రీకరించారు.
@RadioGenoa అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఈజిప్టులోని హుర్ఘడ తీరానికి సమీపంలో 24 ఏళ్ల వ్లాదిమిర్ పోపోవ్ అనే వ్యక్తి సముద్రంలో ఈత కొడుతున్నాడు. ఆ సమయంలో ఓ షార్క్ అతడికి సమీపంలోకి వచ్చింది. అకస్మాత్తుగా అతడిపై దాడి చేసింది. అతడు తనను తాను రక్షించుకోవడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ, షార్క్ శక్తి ముందు అతడి ప్రయత్నం వృథా అయింది. కొన్ని సెకెన్లలోనే అతడిని షార్క్ తినేసింది.
స్థానిక రెస్క్యూ బృందం ఆ షార్క్‌ను గుర్తించి పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చింది. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. వ్లాదిమిర్ చనిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 86 లక్షల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. 29 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
మెడలో పామును పెట్టుకుని బైక్ డ్రైవింగ్.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..
మీ చూపు షార్ప్ అయితే.. ఈ అడవిలో కప్ కేక్ ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..