Viral Video: మోసం చేయడంలో పీహెచ్‌డీ.. కళ్లెదురుగానే ఎలా ఛీటింగ్ చేస్తున్నాడో చూస్తే..
ABN , Publish Date - Jul 15 , 2025 | 12:27 PM
మనం ఎంచుకున్న పళ్లు, కూరగాయలు కాకుండా వేరే పాడైపోయినవి ఇచ్చేవాళ్లు ఎందరో ఉంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి చాకచక్యంగా మోసం చేయడాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
మార్కెట్లోకి వెళ్లి ఏదైనా కొనేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్తకుడు ఏం చేస్తున్నాడో క్షుణ్నంగా గమనించాలి. లేకపోతే కళ్లెదురుగానే మోసాలు (Cheating) జరిగిపోతున్నా మనం కనిపెట్టలేం. మనం ఎంచుకున్న పళ్లు, కూరగాయలు కాకుండా వేరే పాడైపోయినవి ఇచ్చేవాళ్లు ఎందరో ఉంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి చాకచక్యంగా మోసం చేయడాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
thebhagwaman అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. బండి మీద మామిడి పళ్లు (Mangoes) పెట్టుకుని అమ్ముతున్న వర్తకుడి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. తమకు నచ్చిన మామిడి పళ్లును ఎంచుకుని వాటిని కవర్లో వేసి ఇచ్చాడు. ఆ వర్తకుడు వాటిని తూకం వేసే పళ్లెంలో వేశాడు. అయితే అప్పటికే ఆ పళ్లెంలో కొన్ని పాడైపోయిన మామిడి పళ్లు ఉన్నాయి. అతను ఎంచుకున్న వాటిలో కొన్ని తగ్గించి ఆ పాడైపోయిన వాటిని చాకచక్యంగా కవర్లో వేసి ఇచ్చేశాడు. కొనుగోలుదారుడు ఆ విషయాన్ని గుర్తించ లేదు.
అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆ చర్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. 60 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇది వ్యాపారం కాదు.. మోసం అని ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు గతంలో ఇలా రెండుసార్లు జరిగిందని, అసలు విషయం ఇప్పుడర్థమైందని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఆ కుర్రాళ్లకు భయం లేదా.. భారీ కొండచిలువ పక్కనే ఉంటే..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో 998ల మధ్య 993 ఎక్కడుందో 6 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..