Funny Video: మర్చిపోయాడా.. వదిలించుకున్నాడా.. భర్త చేసిన పని చూస్తే నవ్వాగదు
ABN , Publish Date - May 19 , 2025 | 07:14 PM
ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ భర్త చేసిన పని సోషల్ మీడియా జనాలను విపరీతంగా నవ్విస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ భర్త (Husband) చేసిన పని సోషల్ మీడియా జనాలను విపరీతంగా నవ్విస్తోంది (Funny Video). @terakyalenadena అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో (Viral Video) ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి బైక్ (Bike) మీద వెళ్తున్నాడు. అతడు బైక్ నడుపుతుండగా అతడి కొడుకు, భార్య వెనుక కూర్చున్నాడు. బిజీగా ఉన్న రోడ్డుపై అతడు వేగంగా వెళ్తున్నాడు. ఆ సమయంలో అతడికి ఎదురుగా ఓ ట్రక్కు వచ్చింది. దాంతో అతడి బైక్ కొద్దిగా వంగింది. ఆ సమయంలో బైక్ వెనుక కూర్చున్న మహిళ కిందకు దిగిపోయింది. భార్య దిగిపోయినట్టు పట్టించుకోని ఆ వ్యక్తి బైక్ నడుపుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. ఆ ఘటనను అదే రోడ్డులో వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 50 వేల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి ఫన్నీ కామెంట్లు చేశారు. అతడు ఆమె భార్యను కావాలనే వదిలేసి వెళ్లిపోయినట్టున్నాడు అని ఒకరు పేర్కొన్నారు. ఆ రోజు ఆమె తన భర్తను ఇంట్లోకి రానివ్వలేదు అని మరొకరు కామెంట్ చేశారు. భార్యను వదిలించుకోవడానికి మంచి ట్రిక్ కనిపెట్టారని మరొకరు ఫన్నీగా కామెంట్ చేశారు.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..