Viral Wedding Video: పాపం ఈ పెళ్లి కొడుకు.. ఫొటోషూట్ మధ్యలో ఆపేసి మరీ..
ABN , Publish Date - Nov 26 , 2025 | 09:49 PM
పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఫొటోలు దిగుతూ ఉన్నారు. పెళ్లికి వచ్చిన పిల్లలు అటు, ఇటు పరుగులు తీస్తూ ఫొటోషూట్‌కు ఆటంకం కలిగించసాగారు. పిల్లలు పదే పదే ఫొటోషూట్‌కు అడ్డం వస్తూ ఉండటంతో పెళ్లి కొడుకు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
పచ్చటి పెళ్లి పందిరిలో పెళ్లి కొడుకు రెచ్చిపోయాడు. పెళ్లికి వచ్చిన పిల్లలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫొటో షూట్ ఆపేసి మరీ వారికి మైక్‌లో వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ సంగతేంటంటే.. పెళ్లి వేడుక సందర్భంగా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఫొటోలు దిగుతూ ఉన్నారు. పెళ్లికి వచ్చిన పిల్లలు అటు, ఇటు పరుగులు తీస్తూ ఫొటోషూట్‌కు ఆటంకం కలిగించసాగారు. పిల్లలు పదే పదే ఫొటోషూట్‌కు అడ్డం వస్తూ ఉండటంతో పెళ్లి కొడుకు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. మైక్‌లో ఆ పిల్లలకు వార్నింగ్ ఇచ్చాడు.
కేవలం పిల్లలకు మాత్రమే కాదు.. ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. అతడు ఏమన్నాడంటే.. ‘మీరు మీ పిల్లల్ని మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. మా దగ్గర డబ్బులు ఎక్కువగా లేవు. ఫొటోషూట్‌ను పాడుచేయకండి’ అని అన్నాడు. పెళ్లి కొడుకు మాటలు విని పెళ్లికి వచ్చిన వారంతా షాక్ అయ్యారు. ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. పెళ్లి కొడుకుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
‘ఈ మధ్యకాలంలో పెళ్లంటే ఫొటోషూట్ అయిపోయింది. కొంచెం అన్నా బుద్ధి ఉండాలి’..‘పెళ్లి చేసుకునేది అందరినీ కలుపుకుని పోవడానికి. ఆ సందడి కలకాలం గుర్తుండిపోవటానికి’..‘ఇలాంటి వాళ్లను ఏం చేసినా పాపం లేదు. పెళ్లికి వచ్చిన వారిని అలా అవమానిస్తావా?.. తర్వాత ఫొటో షూట్ పెట్టుకో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి
పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. నలుగురు లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుల అరెస్టు
ఏటా లక్ష మంది అగ్నివీరులుగా అవకాశం..!