Children Eat Live Termites: ఏఐ కాదు.. ఆకలి తట్టుకోలేక పురుగుల్ని తింటున్న చిన్నారులు..
ABN , Publish Date - Nov 11 , 2025 | 07:13 PM
ఉగాండా తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటూ ఉంది. కరమోజా సబ్ రీజన్‌లోని ప్రజలు ఆహార కొరతతో అల్లాడుతున్నారు. చాలా మంది దాతల సాయంతోటే కడుపు నింపుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఓ సంఘటన సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఆ దేశాలు కరువుతో అల్లాడిపోతున్నాయి. తినడానికి తిండిలేని పరిస్థితిలో అక్కడి జనం ప్రతీ రోజూ నరకం చూస్తూ ఉన్నారు. చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలి వాళ్ల వరకు ప్రతి నిత్యం ఎంతో మంది ఆకలితో మృత్యువాతపడుతున్నారు. చాలా మంది బతికుండటం కోసం వ్యర్థాలను సైతం తింటున్నారు. తాజాగా, ప్రస్తుతం ఓ ఇద్దరు చిన్నారులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న వారు కంటతడి పెట్టుకుంటున్నారు.
ఆ వీడియోలో ఏముందంటే.. తెల్లటి ప్లేటులో పెద్ద పెద్ద రెక్కలు ఉన్న పురుగులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఓ ఇద్దరు చిన్నారులు ఆ ప్లేటులోని పురుగుల్ని తింటూ ఉన్నారు. వారు ఎంతో ఇష్టంగా వాటిని తింటూ ఉన్నారు. ఈ సంఘటన ఉగాండాలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సంఘటనపై నిపుణులు మాట్లాడుతూ.. ‘ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో తరచుగా పురుగుల్ని తింటూ ఉంటారు. మాంసంలో కంటే అందులో ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. ఐరన్, అమీనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఆ ప్రొటీన్ కోసం వాళ్లు ఆ పురుగుల్ని తింటూ ఉంటారు.
సాధారణంగా వాటిని వండుకుని తింటూ ఉంటారు. కానీ, ఇలా పురుగులు బ్రతికుండగానే తినటం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది’ అని అన్నారు. కాగా, ఉగాండా తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటూ ఉంది. కరమోజా సబ్ రీజన్‌లోని ప్రజలు ఆహార కొరతతో అల్లాడుతున్నారు. చాలా మంది దాతల సాయంతోటే కడుపు నింపుకుంటూ ఉన్నారు.
ఇవి కూడా చదవండి
అన్ని పార్టీ పోస్టులు త్వరితగతిన భర్తీ చేస్తాం: నారా లోకేష్
ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. గెలుపు వారిదేనట..!