Share News

Viral Video: ఓర్నీ.. అండర్‌వేర్‌ను కూడా వదలరా.. ఈ వ్యక్తి ఎలా ఉపయోగిస్తున్నాడో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Aug 03 , 2025 | 06:22 PM

తెలివితేటలు ఉపయోగించి కొత్త పుంతలు తొక్కే వారు బాగా వైరల్ అవుతున్నారు. దాంతో చాలా మంది అలాంటి ప్రయోగాలు చేసి పాపులర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి వింత ప్రయోగం చేయడంలో అన్ని పరిమితులనూ దాటేశాడు.

Viral Video: ఓర్నీ.. అండర్‌వేర్‌ను కూడా వదలరా.. ఈ వ్యక్తి ఎలా ఉపయోగిస్తున్నాడో చూస్తే షాకవ్వాల్సిందే..
Viral Jugaad Video

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పలేము. ముఖ్యంగా విచిత్రమైన ఆలోచనలతో వెరైటీ ప్రయోగాలు చేసే వారికి సంబంధించిన వీడియోలు (Jugaad Video) ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నాయి. తెలివితేటలు ఉపయోగించి కొత్త పుంతలు తొక్కే వారు బాగా వైరల్ అవుతున్నారు. దాంతో చాలా మంది అలాంటి ప్రయోగాలు చేసి పాపులర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి వింత ప్రయోగం చేయడంలో అన్ని పరిమితులనూ దాటేశాడు.


jeejaji అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన పాత అండర్‌వేర్‌ (underwear)తో ఒక బ్యాగ్ తయారు చేశాడు. ఆ బ్యాగ్‌లో టిఫిన్ బాక్స్, ఇంకొన్ని వస్తువులు పెట్టుకుని చక్కగా తీసుకెళ్తున్నాడు. అతను డిజైనర్ బ్యాగ్‌ను మోస్తున్నట్లుగా అందరికీ ఆ బ్యాగ్‌ను ప్రదర్శిస్తూ నడుస్తున్నాడు. పనికి వెళ్లేటపుడు అతడు ఆ అండర్‌వేర్ బ్యాగ్‌లోనే లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (underwear Bag).


ఈ వైరల్ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఈ బ్యాగ్ చాలా చవకైనదని, మన్నికైనదని ఒకరు కామెంట్ చేశారు. ఈ చడ్డీ బ్యాగ్ ముందు ఏ ఇతర బ్రాండెడ్ బ్యాగ్ కూడా పనికిరాదని మరొకరు పేర్కొన్నారు. ఈ బ్యాగ్ మార్కెట్‌లోకి వస్తే, నేను 10 కొంటానని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒకేసారి రెండు కప్పలను మింగిన పాము పరిస్థితి చూడండి..

ఈ మంచులో కుక్క ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెడితే.. మీ కళ్లకు తిరుగులేదు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 03 , 2025 | 06:22 PM