Share News

Video Viral: పోకిరీకి గట్టిగా బుద్ధి చెప్పి బాలిక

ABN , Publish Date - Jul 20 , 2025 | 01:03 PM

Video Viral: కొంత సేపు బాలిక ఓపిక పట్టింది. ఆమె మౌనాన్ని అలుసుగా తీసుకుని అతడు రెచ్చిపోయాడు. దీంతో బాలిక కోపం కట్టలు తెంచుకుంది. అతడ్ని పట్టుకుని కొట్టటం మొదలెట్టింది.

Video Viral: పోకిరీకి గట్టిగా  బుద్ధి చెప్పి బాలిక
Video Viral

ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. పట్ట పగలు కూడా కొంతమంది ఆకతాయిలు ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడుతున్నారు. జనం చూస్తున్నారన్న భయం లేకుండా రెచ్చిపోతున్నారు. నూటికి 90 శాతం మంది వారి ఆకతాయిల వేధింపులు మౌనంగా భరిస్తున్నారు. కానీ, మిగిలిన 10 శాతం మంది ధైర్యంగా ఎదురిస్తున్నారు. ఆకతాయిలకు గట్టిగా బుద్ధి చెబుతున్నారు. తాజాగా, ఓ బాలిక తనను వేధించిన ఆకతాయికి గట్టిగా బుద్ధి చెప్పింది. నడిరోడ్డుపై చెంపలు వాయించింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.


సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉన్నావోకు చెందిన ఓ బాలిక స్కూలుకు వెళుతూ ఉంది. ఆమె పోనీ రోడ్డులో నడుచుకుంటూ వెళుతున్నపుడు ఓ ఆకతాయి వెంబడిపడ్డాడు. బాగా వేధించసాగాడు. కొంత సేపు బాలిక ఓపిక పట్టింది. ఆమె మౌనాన్ని అలుసుగా తీసుకుని అతడు రెచ్చిపోయాడు. దీంతో బాలిక కోపం కట్టలు తెంచుకుంది. అతడ్ని పట్టుకుని కొట్టటం మొదలెట్టింది. రెండు చెంపలు వాయించింది. అతడు తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా వదిలిపెట్టలేదు.


కాలర్ పట్టుకుని మరీ దాడి చేసింది. తర్వాత షూతో కూడా దాడి చేసింది. అక్కడ ఉన్న జనం ఎవ్వరూ బాలికను ఆపలేదు. బాలిక కొడుతుంటే చూస్తూ ఊరు కున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అలాంటి పోకిరీలకు అలాగే బుద్ధి చెప్పాలి. లేదంటే ఎవ్వర్నీ వదిలిపెట్టరు’..‘ఆడవాళ్లకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

జోక్ నిజమైంది.. ఓ ప్రాణం పోయింది..

విమాన ప్రమాదం.. యూఎస్ మీడియా కథనంపై ఏవియేషన్ ఎక్స్‌పర్ట్ ఆగ్రహం

Updated Date - Jul 20 , 2025 | 01:11 PM