Share News

Unitree G1 Robot: పనిచేస్తుండగా నేలకూలిన రోబో.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 09 , 2025 | 02:37 PM

చైనా కంపెనీ యూనిట్రీ రోబోటిక్స్ తయారు చేసిన Unitree G1 రోబోట్ కిచెన్‌లో బౌల్ ని సరిగా పట్టుకోలేకపోయింది. తర్వాత రోబోట్ కూడా నేలపై పడిపోయింది.

Unitree G1 Robot: పనిచేస్తుండగా నేలకూలిన రోబో.. వీడియో వైరల్
Unitree G1 Robot

ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 9: రాబోయే కాలంలో రోబోలదే ముఖ్య పాత్ర అని అందరూ అంటుంటారు. కానీ ఈ రోబో చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఛార్జింగ్ అయిపోయిందో ఏమో కానీ.. పనిలో అలసిపోయి నేలపై పడిపోయింది. ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చైనా కంపెనీ యూనిట్రీ రోబోటిక్స్ తయారు చేసిన Unitree G1 రోబోట్ కిచెన్‌లో బౌల్ ని సరిగా పట్టుకోలేకపోయింది. తర్వాత రోబోట్ కూడా నేలపై పడిపోయింది. ఈ వీడియోను అనేక మంది ట్విట్టర్ (X) యూజర్లు పంచుకున్నారు. వీడియోలో రోబోట్ వంట చేస్తున్నప్పుడు బాణాలిని వదిలేయడం, తర్వాత కిచెన్ చెదిరిపోవడం, చివర్లో రోబోట్ నేలపై కూలిపోవడం కనిపిస్తుంది. ఈ వీడియో నిజమా లేదా AIతో జనరేట్ చేయబడిందా అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు.


ఇది యూనిట్రీ రోబోటిక్స్ రోబోట్‌లో వచ్చిన మొదటి లోపమేమీ కాదు. ఇదే కంపెనీకి చెందిన మరో రోబోట్ యూనిట్రీ H1 ఫ్యాక్టరీలో టెస్టింగ్ సమయంలో ఆకస్మికంగా ఇంజనీర్‌పై దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఈ ఏడాది వైరల్ అయింది. సోషల్ మీడియాలో యూజర్లు ఇప్పుడు AI రోబోట్ల భద్రతపై పలు అనుమానాలు లేవనెత్తుతున్నారు. రోబోట్లు, కృత్రిమ మేధస్సు (AI) భవిష్యత్తులో మనుషులకు ఎంత భద్రంగా ఉంటాయో కాలమే నిర్ణయించాలంటూ కామెంట్లు పెడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 14 సెకెన్లలో కనిపెట్టండి

నిజంగా ఇది ఊహించని ట్విస్ట్.. ఆ మహిళ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

Updated Date - Nov 09 , 2025 | 02:51 PM