Fish drinking Water: పాపం చేప.. బతుకు పోరాటం.. ఈ గ్రాస్ కార్ప్ ఫిష్ ప్రత్యేకతలు ఏంటంటే..
ABN , Publish Date - Sep 11 , 2025 | 10:36 AM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆశ్చర్యకరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ విచిత్రమైన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. చేప కొళాయి నీళ్లు తాగుతోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆశ్చర్యకరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ విచిత్రమైన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ చేప కొళాయి నీళ్లు తాగుతోంది. అది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన వీడియో అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే అది నిజమైన వీడియోనే కావడం గమనార్హం (Unbelievable fish behavior).
heartwistt అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. బకెట్‌లో కొన్ని చేపలు ఉన్నాయి (shocking fish video). ఆ బకెట్ పైన ఉన్న కొళాయి నుంచి నీరు పడుతోంది. ఒక చేప పైకి లేచి నోరు తెరిచి ఆ నీటిని తాగుతోంది. వేసవిలో పిల్లలు కుళాయి నుంచి నేరుగా నీరు తాగుతున్న దృశ్యం లాగానే ఇది కూడా కనిపిస్తోంది. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించిన వీడియో అని చాలా మంది కామెంట్లు చేశారు. అయితే గ్రాస్ కార్ఫ్ ఫిష్‌కు చెందిన ఆ వీడియో (Grass Carp video) నిజమైనదే అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
మంచి నీటి సరస్సులో మాత్రమే కనిపించే గ్రాస్ కార్ఫ్ చేప ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనుగడ సాగించే లక్షణం కలిగి ఉంటుంది (Grass Carp survival). నీటిలోని చేపలు మొప్పల ద్వారా గాలిని పీల్చుకుంటాయి. నీటిలోని ఆక్సిజన్‌ను చేపల మొప్పలు గ్రహిస్తాయి. ఇక్కడ ఆ గ్రాస్ కార్ప్ చేప తన మొప్పలకు నీరు తగిలేలా చూసుకుంటూ గాలి పీల్చుకుంటోంది. సాధారణంగా చేపలు నీటి నుంచి బయటకు వస్తే మొప్పలకు నీరు అందకపోవడం వల్ల చనిపోతాయి. ఇక్కడ ఆ చేప తన మొప్పలకు కొళాయి నీటిని అందించి బతుకు పోరాటం సాగిస్తోంది.
ఇవి కూడా చదవండి..
బరువు తగ్గండి.. లక్షలు సంపాదించండి.. ఉద్యోగులకు ఓ కంపెనీ ఆఫర్..
మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలోని ఇద్దరు వ్యక్తులను 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..