Share News

Coach Violation: లేడీస్ కోచ్‌లోకి ఎక్కారని గొడవ.. టీటీఈలను చావగొట్టిన యువకులు

ABN , Publish Date - Jul 26 , 2025 | 09:56 PM

Coach Violation: లేడీస్ కోచ్‌లోకి ప్రవేశించారని ఇద్దరు టీటీఈలు కొంతమంది యువకులతో గొడవపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ యువకుడిపై దాడికి దిగారు. దీంతో యువకుడి గ్యాంగ్ ఆ ఇద్దరు టీటీఈలపై దాడి చేసింది.

Coach Violation: లేడీస్ కోచ్‌లోకి ఎక్కారని గొడవ.. టీటీఈలను చావగొట్టిన యువకులు
Coach Violation

ఈ కాలంలో అమ్మా, అయ్యా అని మంచిగా, మర్యాదగా చెబితే వినటమే కష్టం. అలాంటిది కొడితే వింటారా?.. ఓ ఇద్దరు టీటీఈలు లేడీస్ కోచ్‌లోకి ఎక్కాడని ఓ యువకుడిపై దాడి చేశారు. ఆ దాడి టీటీఈల ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ యువకుడి గ్యాంగ్ ఇద్దరు టీటీఈలను చావగొట్టింది. ఈ సంఘటన కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం నాడు 15 నుంచి 20 మంది యువకులు సూరత్ టు ముజఫర్‌పుర్ వెళుతున్న స్పెషల్ రైలులో ప్రయాణిస్తూ ఉన్నారు.


రైలు కాన్పూర్ రైల్వే స్టేషన్ చేరుకోవడానికి కొంత సమయం ముందు వారంతా లేడీస్ కోచ్‌లోకి ప్రవేశించారు. లోపల ఉన్న టీటీఈలు వారిని ఆపే ప్రయత్నం చేశారు. దీంతో గొడవ మొదలైంది. రైలు కాన్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఆగగానే ఓ టీటీఈ ఓ యువకుడిని ప్లాట్ ఫామ్ మీదకు లాగి కొట్టడం మొదలెట్టాడు. ఈ నేపథ్యంలో మిగిలిన వాళ్లు ఆయన్ని ఆపే ప్రయత్నం చేశారు. అయితే, ఆ టీటీఈ వారి మాట వినలేదు. దీంతో యువకులు ఆగ్రహానికి గురయ్యారు. ఇద్దరు టీటీఈలపై దాడికి దిగారు.


ఈ దాడిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి దిగిన ఓ యువకుడిని రాజా యాదవ్‌గా గుర్తించారు. అతడిపై చర్యలకు సిద్దమయ్యారు. అయితే, గొడవకు కారణమైన టీటీఈ మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఆ ఇద్దరు టీటీఈలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

పామును కొరికి చంపిన పిల్లాడు.. తర్వాత ఏమైందంటే..

తప్పిన పెను ప్రమాదం.. కూలిన ప్రభుత్వ స్కూలు పైకప్పు..

Updated Date - Jul 26 , 2025 | 09:56 PM