1 Year Old Bites Cobra: పామును కొరికి చంపిన పిల్లాడు.. తర్వాత ఏమైందంటే..
ABN , Publish Date - Jul 26 , 2025 | 09:11 PM
1 Year Old Bites Cobra: బీహార్ రాష్ట్రంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఏడాది పిల్లాడు నాగుపామును కొరికి చంపేశాడు. అయితే, ఈ ఘటనలో పిల్లాడికి మాత్రం ఏమీ కాలేదు.
బీహార్ రాష్ట్రంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఏడాది పిల్లాడు నాగుపామును కొరికి చంపేశాడు. అయితే, ఈ ఘటనలో పిల్లాడికి మాత్రం ఏమీ కాలేదు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెట్టియా జిల్లా, బంకత్వా గ్రామానికి చెందిన ఏడాది బాలుడు గోవింద శుక్రవారం ఇంట్లో ఆడుకుంటూ ఉన్నాడు. అలా ఆడుకుంటున్న సమయంలో అతడు ఓ నాగుపామును చూశాడు. మెల్లగా దాని దగ్గరకు నడుచుకుంటూ వెళ్లాడు. మొదట దాన్ని ఓ వస్తువుతో కొట్టాడు.
తర్వాత చేతుల్లోకి తీసుకుని, పళ్లతో కొరికేశాడు. దీంతో పాము అక్కడికక్కడే చనిపోయింది. వంట చెరుకు కోసం బయటకు వెళ్లిన పిల్లాడి తల్లి కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. పామును, పిల్లాడిని పక్కన పక్కన చూసి షాక్ అయింది. గుండెలు బాదుకుంది. వెంటనే ఇతర కుటుంబసభ్యుల్ని అలర్ట్ చేసింది. వారంతా కలిసి బాలుడ్ని ఆస్పత్రికి తరలించారు. బాలుడ్ని పరీక్షించిన వైద్యులు.. అతడ్ని పాము కాటు వేయలేదని చెప్పారు. దీంతో కుటుంసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
పిల్లాడు పామును కొరికి చంపిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పిల్లాడు ఆస్పత్రి బెడ్‌పై ఉన్న దృశ్యాలు ఉన్నాయి. పిల్లాడి నాన్నమ్మ సంఘటన గురించి చెబుతూ ఉంది. కాగా, గత సంవత్సరం గయలోనూ ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ పిల్లాడు పామును కొరికి చంపేశాడు. పిల్లాడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా పాము అతడ్ని కాటు వేయలేదని తేలింది.
ఇవి కూడా చదవండి
ఇజ్రాయెల్ కీలక నిర్ణయం.. ఇకపై సైనికులకు అరబిక్, ఇస్లామిక్ చదువులు
తప్పిన పెను ప్రమాదం.. కూలిన ప్రభుత్వ స్కూలు పైకప్పు..