Viral Video: పొట్టకూటి కోసం చిన్నారి పాట్లు.. ప్రమాదపుటంచున ప్రయాణం
ABN , Publish Date - Nov 01 , 2025 | 04:27 PM
ట్రైన్‌లో ప్రయాణిస్తూ డబ్బులు అడుక్కుంటూ, కింద పడిన వస్తువులను ఏరుకుంటూ వాటిని అమ్ముకుని చిల్లర డబ్బులు వస్తే కడుపునింపుకునే ఓ అనాథ చిన్నారి ప్రమాదపుటంచున ప్రయాణించింది. వేగంగా వెళ్తోన్న ట్రైన్‌లో ఫుడ్ బోర్డు ప్రయాణం చేసింది. ట్రైన్ చివరి మెట్టుపై నిల్చోయి ప్రయాణించింది.
ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 1: పొట్టకూటి కోసం ఎంతో మంది ఎన్నో రకాల కఠినమైన పనులు చేయడం మనం చూసుంటాం. కూలిపని మొదలుకొని అనేక పనులు చేస్తుంటారు. జానెడు పొట్టకోసం రోజంతా కష్టపడుతుంటారు. అనాథలు అయితే మరీ చెప్పనక్కర్లేదు. రోడ్ల వెంట చిత్తు కాగితాలు ఏరుకుంటూ రూపాయో రెండు రూపాయల కోసమే పరితపిస్తుంటారు. మురికి కాలువల వెంట, చెత్త కుప్పల వెంట ప్లాస్టిక్ వస్తువులను ఏరుకుంటూ వాటిని అమ్ముకొని ఏ పది రూపాయలో వస్తే.. వాటితో ఓ బ్రెడ్డు ముక్క కొనుక్కొని కడుపునింపుకుంటారు. రోడ్ల వెంట, రైళ్ల వెంట పరిగెడుతూ డబ్బులు అడుక్కుంటూ కడుపునింపుకుని జీవనం సాగిస్తుంటారు. ఇలాగే ఓ చిన్నారి ప్రమాదపుటంచున ప్రయాణించింది. వేగంగా వెళ్తోన్న ట్రైన్‌లో ఫుడ్ బోర్డ్ ప్రయాణం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్రైన్‌లో ప్రయాణిస్తూ డబ్బులు అడుక్కుంటూ, ట్రైన్ లో కింద పడిన వస్తువులను ఏరుకుంటూ వాటిని అమ్ముకుని చిల్లర డబ్బులు వస్తే కడుపునింపుకునే ఓ అనాథ చిన్నారి ప్రమాదపుటంచున ప్రయాణించింది. వేగంగా వెళ్తోన్న ట్రైన్‌లో ఫుడ్ బోర్డు ప్రయాణం చేసింది. ట్రైన్ చివరి మెట్టుపై నిల్చోని ప్రయాణించింది. స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో ట్రైన్ నెమ్మదిగా ప్రయాణించడంతో ఆ చిన్నారి చటుక్కున దిగేసింది. జస్ట్ మిస్ అయి ట్రైన్ కింద పడితే ఆ చిన్నారి ప్రాణాలతో దక్కేది కాదు. అంతటి ప్రమాదం పొంచి ఉందని తెలిసినా.. చిన్నారి పొట్టను నింపుకోవడాని కోసం ప్రాణాలకు తెగించి ప్రయనిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'పాపం చిన్నారి' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనాథలను ఆదుకునేందుకు ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలతో ముందుకు రావాలని, అనాథలకు భరోసాగా ప్రభుత్వం ఉండాలని కోరుతున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి:
Kasibugga Tragedy: కాశీబుగ్గ ఘటనలో బాధ్యులపై చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: తెలంగాణలో పెట్టుబడుల కోసం ముందుకు రావాలి: సీఎం రేవంత్ రెడ్డి