Waqf Act protests: బెంగాల్ మంటలు.. యూసఫ్ పఠాన్ 'గుడ్ ఛాయ్' పోస్టుపై విమర్శలు
ABN , Publish Date - Apr 13 , 2025 | 02:56 PM
హింసాత్మక ఘటనలతో బెంగాల్ తగులబడుతుంటే టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ 'కూల్ ఛాయ్' ఫోటోలు పోస్ట్ చేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

కోల్‌కతా: ఓ వైపు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలతో బెంగాల్ అట్టుడుకుతుంటే బాధ్యత కలిగిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) భహరంపూర్ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెట్ యూసుఫ్ పఠాన్ (Yusuf Pathan) సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. టీ తాగుతూ రిలాక్స్ అవుతున్నట్టు ఆ ఫోటోల్లో పఠాన్ కనిపిస్తు్న్నారు. ''మంచి టీ తాగుతూ ప్రశాంతమైన పరిసరాలతో ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను" అంటూ ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో ప్రధాన విపక్షమైన బీజేపీతో పాటు పలువురు నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలకు బదులు ముర్షీదాబాద్‌లో ఏం జరుగుతోందో తెలిపే ఫోటోలు పోస్ట్ చేసి ఉండొచ్చంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముర్షీదాబాద్ జిల్లాలోనే బహరాంపూర్ నియోజకవర్గం ఉంది.
West Bengal Waqf protests: వక్ఫ్ విధ్వంసం.. ముగ్గురు మృతి.. 150 మంది అరెస్ట్
ముర్షీదాబాద్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఇలాంటి అనాలోచిత పోస్టులు ఏమిటంటూ బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. ''బెంగాల్ తగులబడుతోంది. కళ్లు మూసుకుని ఉండలేమంటూ హైకోర్టు కేంద్ర బలగాలను మొహరించాలని ఆదేశించింది. మమతాబెనర్జీ రక్షణలో హింస జరుగుతోంది. పోలీసులు చేష్టలుడిగినట్టు వ్యవహరిస్తున్నారు. హిందువులను ఊచకోత కోస్తున్న ఈ తరుణంలో టీ సిప్ చేస్తూ యూసఫ్ ఫఠాన్ ఫోటోలు పెట్టడం ఏమిటి?'' అని ప్రశ్నించారు. పఠాన్‌ను ఎక్కడ్నించో మమతాబెనర్జీ తీసుకువచ్చి ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చారని, ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే ఆయన బహరాంపూర్‌లో నెగ్గారని పూనావాలా అన్నారు. దాస్ వంటి పలు కుటుంబాలు హింసాకాండ బాధితులుగా మిగిలిపోతుంటే పఠాన్ మాత్రం వేరే మూడ్‌లో ఉన్నారు. టీఎంసీ నాయకత్వాన్ని ఏమాత్రం జవాబుదారీతనం, బాధ్యత లేదనడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు.
సిగ్గులేదా?
పఠాన్ షేర్ చేసిన ఫోటోలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ''హిందువులను ముస్లింలు అత్యంత దారుణంగా కొడుతుంటే టీ సిప్‌లతో ఎంజాయ్ చేయడానికి సిగ్గనిపించడం లేదా? ముందు ఒక మనిషినని అనిపించుకో. ఆ తర్వాత వచ్చి ఓట్లు అడుగు. నీకు మానవత్వం లేదు. సిగ్గు చేటు'' ఒక నెటిజన్ వ్యాఖ్యనించారు. ముర్షీదాబాద్ తగులబడుతుంటే నీ నియోజకవర్గం బాధ్యత చూసుకోవాల్సి పని లేదా? నీలాంటి ఎంపీలు మాకు అక్కర్లేదని మరొకరు అన్నారు. అసలు ముర్షీదాబాద్ పేరు విన్నావా? నువ్వు అక్కడి ఎంపీవి, అర్ధమైందా? హింసను ఆపేందుకు ఏదైనా చెయ్యి"మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి