West Bengal Waqf protests: వక్ఫ్ విధ్వంసం.. ముగ్గురు మృతి.. 150 మంది అరెస్ట్
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:37 AM
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలతో పశ్చిమబెంగాల్ అట్టుడికిపోతుంది. పలు జిల్లాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ముషీరాబాద్‌లో తీవ్ర విధ్వంసకర పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఆ వివరాలు..

కోల్‌కతా: వక్ఫ్ బిల్లుకు పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టంగా మారినప్పటికీ.. దానిపై ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ బిల్లు విధ్వంసం సృష్టిస్తుంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా రెండు రోజుల క్రితం అనగా శుక్రవారం నాడు పశ్చిమబెంగాల్.. ముర్షీదాబాద్, మాల్దా, హుగ్లీ, దక్షిణ 24 పరగణా జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ముర్షీదాబాద్ ప్రాంతంలో శనివారం కూడా ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. విధ్వంసకర ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు మోహరించేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే కేంద్ర బలగాల రాకను రాష్ట్ర ప్రభుత్వం తప్పు పట్టగా.. హైకోర్టు మాత్రం స్వాగతించింది. పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో జరుగుతున్న విధ్వంసg గురించి నివేదికలు అందాయి. వాటిని చూశాక కూడా కళ్లు మూసుకుని ఉండలేమని వ్యాఖ్యానించింది. ఇక ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో ముగ్గురు చనిపోయారని.. సుమారు 150 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం సుతి, ధులియాన్, సంసెర్‌గంజ, జంగీపూర్ ప్రాంతాలలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసులు తెలిపారు.
నిరసనలపై బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో హిందువులు "సురక్షితంగా లేరని" ఆరోపించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శాంతి భద్రతల కోసం విజ్ఞప్తి చేస్తూనే.. కొన్ని రాజకీయ పార్టీలు" "రాజకీయ లాబ్ధి కోసం మతాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని" ఆరోపణలు చేయడం ఆమె వక్రబుద్ధికి నిదర్శనం అంటూ విమర్శించారు.
ఇక మృతి చెందిన వారిలో ఇద్దరు తండ్రీకొడుకులు ఉండగా వారిని హర్‌గోబింద్ దాస్, చందన్ దాస్‌గా గుర్తించారు. కొందరు దుండగులు వీరిని నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. మరోక నిరసన కారుడు బుల్లెట్ గాయాలతో మరణించిట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ముర్షీదాబాద్ ప్రాంతంలో 300 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. హైకోర్టు అత్యంత సున్నిత ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలను మోహరించేలా ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి:
Waqf Land: సంభాల్ దర్గా వక్ఫ్ భూమి ఆక్రమణపై దర్యాప్తు..వెలుగులోకి సంచలన విషయాలు
Love Marriage: కుమార్తె ప్రేమ వివాహం.. కన్నీళ్లు తెప్పిస్తున్న తండ్రి సూసైడ్ లెటర్