Share News

Rukmini Vijayakumar: ప్రముఖ నటి కారులో చోరీ.. ఏకంగా 23 లక్షల సొత్తు దోచేశాడు..

ABN , Publish Date - May 18 , 2025 | 12:17 PM

Actress Rukmini Vijayakumar: ఆ కారుకు కొద్ది దూరంలో నిలబడి ఉన్న రజా మహ్మద్ మస్తాన్ ఇదంతా చూశాడు. రుక్మిణి మార్నింగ్ వాక్ చేయడానికి అక్కడినుంచి వెళ్లిపోయింది. రజా మహ్మద్ కారు దగ్గరకు చేరుకున్నాడు. చాకచక్యంగా కారు డోరు తెరిచాడు.

Rukmini Vijayakumar: ప్రముఖ నటి కారులో చోరీ.. ఏకంగా 23 లక్షల సొత్తు దోచేశాడు..
Actress Rukmini Vijayakumar

సీతారామం నటి రుక్మిణి విజయ్ కుమార్ కారులో దొంగతనం జరిగింది. ఓ క్యాబ్ డ్రైవర్ ఆమె కారులోంచి ఏకంగా 23 లక్షలు విలువ చేసే సొమ్మును ఎత్తుకెళ్లిపోయాడు. చివరకు పోలీసులకు దొరికి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నటి రుక్మిణి విజయ్ కుమార్ గత ఆదివారం బెంగళూరులోని కబ్బన్ పార్కుకు మార్నింగ్ వాక్ కోసం వెళ్లారు. తన కారును క్వీన్స్ రోడ్డులోని బస్టాప్ దగ్గర పార్క్ చేశారు. విలువైన వస్తువులు ఉన్న బ్యాగును కారులోనే పెట్టారు. ఆ కారుకు కొద్ది దూరంలో నిలబడి ఉన్న రజా మహ్మద్ మస్తాన్ ఇదంతా చూశాడు.


రుక్మిణి మార్నింగ్ వాక్ చేయడానికి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ వెంటనే రజా మహ్మద్ కారు దగ్గరకు చేరుకున్నాడు. చాకచక్యంగా కారు డోరు తెరిచాడు. కారులోని బ్యాగును ఎత్తుకెళ్లిపోయాడు. ఆ బ్యాగులో వజ్రాల ఆభరాలు, రోలెక్స్ వాచ్‌తో పాటు ఖరీదైన వస్తువులు మరికొన్ని ఉన్నాయి. ఉదయం 8 నుంచి 10 గంటల ప్రాంతంలో ఈ దొంగతనం జరిగింది. రుక్మిణి మార్నింగ్ వాక్ అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చింది. కారులో బ్యాగు లేకపోవటం గుర్తించింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


పోలీసుల దర్యాప్తులో దొంగతనం చేసింది తమిళనాడుకు చెందిన క్యాబ్ డ్రైవర్ రజా మహ్మద్‌గా గుర్తించారు. మహాలక్ష్మి లే అవుట్ దగ్గర రజా మహ్మద్‌ను అరెస్ట్ చేశారు. అతడి ఇంటినుంచి దొంగిలించిన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం అయిన వస్తువులు తిరిగి దొరకటంతో రుక్మిణి ఊపిరి పీల్చుకున్నారు. ఇక, రుక్మిణి సినిమా సంగతుల విషయానికి వస్తే.. ఆమె ఆనంద తాండవం, భజరంగీ, కొచ్చాడయాన్ సినిమాల్లో నటించింది. సీతారామమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.


ఇవి కూడా చదవండి

Bhupalpally: ధాన్యం బస్తాలో లక్షన్నర దాచిన భర్త .. భార్య ఏం చేసిందంటే..

Sai Rajeshs Film: సాయి రాజేష్‌కు షాకిచ్చిన బాబిల్.. బేబీ రీమేక్‌నుంచి ఔట్..

Updated Date - May 18 , 2025 | 01:03 PM