13 months in a year: సంవత్సరానికి 13 నెలలు.. ఆ క్యాలెండర్‌ను అనుసరిస్తున్న దేశం ఏదో తెలుసా..
ABN , Publish Date - Dec 17 , 2025 | 08:12 PM
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్‌నే అనుసరిస్తుంటాయి. దాదాపు అన్ని దేశాల క్యాలెండర్లలోనూ సంవత్సరానికి 12 నెలలే ఉంటాయి. అయితే, ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దేశం మాత్రం భిన్నమైన క్యాలెండర్‌ను ఫాలో అవుతుంటుంది. ఆ దేశపు క్యాలెండర్ 12 కాదు, 13 నెలలను కలిగి ఉంటుంది.
ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి. ఒక్కో దేశం వేర్వేరు నియమాలు, నిబంధనలు, విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలను కలిగి ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్‌నే అనుసరిస్తుంటాయి. దాదాపు అన్ని దేశాల క్యాలెండర్లలోనూ సంవత్సరానికి 12 నెలలే ఉంటాయి. అయితే, ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దేశం మాత్రం భిన్నమైన క్యాలెండర్‌ను ఫాలో అవుతుంటుంది. ఆ దేశపు క్యాలెండర్ 12 కాదు.., 13 నెలలను కలిగి ఉంటుంది (country with 13 months).
అది ఆఫ్రికన్ దేశమైన ఇథియోపియా. యూరప్ దేశాల వలస పాలన కిందకు వచ్చిన అన్ని దేశాలు దాదాపు ఒకే క్యాలెండర్‌ను ఫాలో అవుతుంటాయి. అయితే ఇథియోపియా మాత్రం ఎప్పుడూ వలస పాలన కింద లేదు. 1935లో ఇటాలియన్లు ఇథియోపియాను ఆక్రమించడానికి ప్రయత్నించారు. ఆరు సంవత్సరాల పాటు సైనికపరంగా దేశాన్ని ఆక్రమించారు. అయితే ఇథియోపియన్ దళాలు గట్టిగా ప్రతిఘటించడంతో మొత్తం దేశం వారి నియంత్రణలోకి రాలేదు. దీంతో ఇథియోపియా సంస్కృతి, సాంప్రదాయాలపై ఇతరుల ప్రభావం పెద్దగా లేదు (Ethiopian calendar explained).
ఇథియోపియాలో యేసుక్రీస్తు జనన గణన భిన్నంగా ఉండడం వల్ల ఆ దేశపు క్యాలెండర్, గ్రెగోరియన్ క్యాలెండర్‌కు భిన్నంగా ఉంటుంది (unique calendar system). ఇథియోపియన్ క్యాలెండర్‌లోని మొదటి 12 నెలల్లో 30 రోజులు ఉంటాయి. చివరిదైన 'పాగుమే' నెల కేవలం 5 నుంచి 6 రోజులు మాత్రమే కలిగి ఉంటుంది. ఈ రోజు వరకు ఇథియోపియా తన పురాతన క్యాలెండర్‌ను మాత్రమే ఉపయోగిస్తోంది. కాగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇథియోపియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇథియోపియా తన అత్యున్నత పురస్కారం 'గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా'ను ప్రధాని మోదీకి అందజేసింది.
ఇవి కూడా చదవండి..
హోటల్లో ప్రియుడితో భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కన్నీరు పెట్టుకున్న భర్త..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 36ల మధ్యలో 63 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..