Share News

CCTV Moment Goes Viral: సినిమాను తలపించేలా దొంగతనం సీన్.. దొంగ వెనకాల ఊరు జనం..

ABN , Publish Date - Jul 27 , 2025 | 06:07 PM

CCTV Moment Goes Viral: ఓ ఇంట్లో దొంగ చోరీకి పాల్పడ్డాడు. తప్పించుకుని పారిపోతున్న అతడి వెంట ఊరుమొత్తం పడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

CCTV Moment Goes Viral: సినిమాను తలపించేలా దొంగతనం సీన్.. దొంగ వెనకాల ఊరు జనం..
CCTV Moment Goes Viral

ఉత్తర ప్రదేశ్‌లో సినిమాను తలపించే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. దొంగను పట్టుకోవడానికి గ్రామం మొత్తం అతని వెనకాల పడింది. ఆ దొంగ.. విలన్ల నుంచి తప్పించుకునే హీరోలాగా తుపాకితో కాల్పులు జరుపుతూ వారినుంచి తప్పించుకుని పారిపోయాడు. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం రామ్‌పూర్‌ ప్రావిన్స్, తిన్ వాలీ మజీద్ మెహల్లాలోని ఓ ఇంట్లో దొంగ చోరీకి పాల్పడ్డాడు. అతడు ఇంటినుంచి బయటకు పారిపోతున్నపుడు పొరిగిళ్ల వారు చూశారు.


వాళ్లు గట్టిగా అరుస్తూ వీధిలోని మిగిలిన ఇళ్ల వాళ్లకు విషయం చెప్పారు. అందరూ ఒక్కసారిగా బయటకు వచ్చారు. దొంగ వెంటపడ్డారు. వీళ్లను చూసి గ్రామంలోని చాలా మంది కూడా దొంగ వెంటపడ్డారు. దాదాపు 70 మంది దొంగను వెంబడించారు. ఆ దొంగ తుపాకితో కాల్పులు జరుపుతూ అక్కడినుంచి పరుగులు తీశాడు. మొత్తానికి వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఇక,ఈ దొంగతనంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


దొంగ కోసం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ వీడియో చూస్తుంటే డైరెక్టర్ ప్రియదర్శన్ సినిమాల్లో క్లైమాక్స్ సీన్స్ గుర్తొస్తున్నాయి’..‘అచ్చం భాగమ్ భాగ్ సినిమాలో చూసినట్లుగా ఉంది’..‘వాళ్లు దొంగను పట్టుకున్నారా? లేదా ? అన్న సంగతి పక్కన పెడితే.. వాళ్ల ఐక్యతకు హాట్సాఫ్ చెప్పొచ్చు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఇండియాను అంటారా? ఓ సారి అమెరికాలో పరిస్థితి చూసుకోండి..

ఇన్‌స్టా లవ్.. కొడుకును బస్టాండ్‌లో వదిలేసి ప్రియుడితో పరార్..

Updated Date - Jul 27 , 2025 | 06:12 PM