Jugaad viral video: ఇదెక్కడి పిచ్చి నాయనా.. హెల్మెట్, గ్లౌస్‌లకు బదులుగా ఏం వాడుతున్నారో చూడండి..
ABN , Publish Date - Dec 01 , 2025 | 03:28 PM
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (creative jugaad ideas).
lasthourindia అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుత చలికాలంలో బైక్ మీద వెళ్లే వాళ్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా హెల్మెట్, చేతి గ్లౌస్‌లు ధరించకపోతే చలి వల్ల ఇబ్బందులు తప్పవు. అయితే అవి అందుబాటులో లేని సమయంలో ఏం చేయాలో చూపుతూ ఓ వ్యక్తి వీడియో రూపొందించాడు. రెండు సంచులను కట్ చేసి బ్రేక్, క్లచ్‌తో పాటు రెండు హ్యాండిల్ బార్‌లకు సరిపోయేలా అమర్చారు (funny hacks).
అలా చేయడం వల్ల చేతులకు చలి వేయకుండా ఉంటుంది (viral jugaad clip). అయితే ఆ బైక్ మీద కూర్చున్న ఇద్దరు వ్యక్తులు హెల్మెట్లు ధరించడానికి బదులుగా డైపర్లు ధరించి ఉన్నారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. 8, 600 మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. 'మన దేశంలో చాలా పేదరికం ఉంది, ప్రజలు హెల్మెట్లు, చేతి తొడుగులు కూడా కొనలేరు' అని ఒకరు కామెంట్ చేశారు. ఇలాంటి పిచ్చి పనులు చేయకండని మరొకరు హితవు పలికారు.
ఇవి కూడా చదవండి..
పాపం.. మృగరాజు.. అడవి గేదెపై దాడి చేస్తే ఏం జరిగిందో చూడండి..
మీ దృష్టి షార్ప్ అయితే.. ఈ ఫొటోలో తోడేలు ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..