Expired Relief Aid: శ్రీలంకకు పాకిస్థాన్ సాయం.. మరీ ఇంత దారుణమా?..
ABN , Publish Date - Dec 02 , 2025 | 02:52 PM
వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన శ్రీలంకకు సాయం చేయడానికి పాకిస్థాన్ ముందుకు వచ్చింది. పాల పౌడర్ ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లు, మెడిసిన్స్‌ను శ్రీలంకకు పంపింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శల పాలవుతోంది.
భారీ వర్షాలు, వరదల కారణంగా శ్రీలంక అల్లకల్లోలం అయింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటి వరకు 334 మంది చనిపోగా.. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. వరదల కారణంగా నష్టపోయిన శ్రీలంకను ఆదుకోవడానికి భారత్ ఇప్పటికే రంగంలోకి దిగింది. ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరిట సహాయక చర్యలు చేపడుతోంది. ఇప్పటి వరకు 53 టన్నుల రిలీఫ్ మెటీరియల్ అందించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా శ్రీలంక ప్రభుత్వం స్వయంగా వెల్లడించింది.
పాకిస్థాన్ పాడు బుద్ధి..
శ్రీలంకను ఆదుకోవడానికి పాకిస్థాన్ కూడా ముందుకు వచ్చింది. ఈ మేరకు పలు ఆహార పదార్థాలను శ్రీలంకకు పంపింది. పాకిస్థాన్ పంపిన వాటిలో పాల పౌడర్ ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లు, మెడిసిన్స్ ఉన్నాయి. పాల పౌడర్ ప్యాకెట్ల తాలూకా ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటి కారణంగా పాకిస్థాన్ నవ్వుల పాలవుతోంది. నెటిజన్లు పాకిస్థాన్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇంతకీ సంగతేంటంటే.. పాకిస్థాన్ పంపిన పాల పౌడర్ 2024 అక్టోబర్ నెలలోనే ఎక్స్‌పైర్ అయింది. ఈ విషయం ప్యాకెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ఎక్స్‌పైర్ అయిన వాటిని ఆహారంగా తీసుకోవటం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. ఇది తెలిసి కూడా పాకిస్థాన్ ఎక్స్‌పైర్ అయిన పాల పౌడర్‌ను శ్రీలంకకు పంపింది. ఆ ప్యాకెట్లపై ‘పాకిస్థాన్, శ్రీలంకకు అండగా నిలుస్తుంది. ఈ రోజు, ఎప్పటికీ’ అని రాసి ఉంది. ఇక, ఎక్స్‌పైర్ అయిన ఆహార పదార్ధాలు పంపటంపై పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి
అత్యంత పిన్న వయసులో సెంచరీ.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
గ్లోబల్ సమ్మిట్‌పై సమీక్ష.. అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు