Share News

Idli Bonda Goes Viral: ఇలాంటి ఇడ్లీలను ఎక్కడా చూసుండరు.. వైరల్ వీడియో..

ABN , Publish Date - Nov 25 , 2025 | 03:06 PM

ఇడ్లీ కొత్త అవతారం ఎత్తింది. నార్త్ ఇండియాలోని ఓ టిఫిన్ సెంటర్‌ ఇడ్లీని వెరైటీగా తయారు చేసి అమ్ముతోంది. దానికి ‘ఇడ్లీ బోండా’ అని పేరు కూడా పెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Idli Bonda Goes Viral: ఇలాంటి ఇడ్లీలను ఎక్కడా చూసుండరు.. వైరల్ వీడియో..
Idli Bonda Goes Viral

దక్షిణ భారత దేశ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ‘ఇడ్లీ’. ప్రతీ రోజూ ఉదయం ఇడ్లీని టిఫిన్‌గా తీసుకునే వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఉత్తర భారత దేశంలో కూడా ఇడ్లీ హవా నడుస్తోంది. అక్కడి ప్రజలు కూడా ఇష్టంగా ఇడ్లీని తినటం స్టార్ట్ చేశారు. అయితే, ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇడ్లీని ఇడ్లీలా కాకుండా వెరైటీగా మార్చి తినేస్తున్నారు. నార్త్‌లో ఇడ్లీ బోండా అనేది పుట్టుకు వచ్చింది.


ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర భారత దేశంలోని ఓ ప్రాంతంలో ఉన్న టిఫిన్ సెంటర్ ఇడ్లీని కొత్తరకంగా మార్చి అమ్మేస్తోంది. ఇడ్లీలు వేసిన తర్వాత వాటిని నూనెలో బాగా వేయిస్తోంది. వాటికి ‘ఇడ్లీ బోండా’ అని పేరు పెట్టి అమ్మేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇడ్లీని చంపేశారు కదయ్యా’..


‘టిఫిన్ సెంటర్‌కు సౌత్ ఇండియన్ పేరు పెట్టి.. ఇడ్లీలను దారుణంగా మార్చేస్తున్నారు’.. ‘ఇలాంటి ఇడ్లీని నేను ఎక్కడా చూడలేదు’..‘ఇంకా ఎన్నెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో’.. ‘ ఇడ్లీలు మల్లె పువ్వులా తెల్లగా ఉండాలి అంటారు. మీరు వాటిని పకోడీలా ఎర్రగా మార్చేశారు’..‘ఇలాంటి నూనె ఇడ్లీలు తింటే ఆరోగ్యం పాడు కావటం ఖాయం’..‘ఇడ్లీలు అమర్‌రహే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

మరోసారి ఆసుపత్రిలో చేరిన పలాశ్

ధ్వజారోహణ ప్రత్యేకత.. జెండాపై ఏముందంటే..?

Updated Date - Nov 25 , 2025 | 03:06 PM