Maharashtra Drone Chase: వరుడిపై దాడి చేసిన నిందితులను డ్రోన్‌తో వెంబడించి..
ABN , Publish Date - Nov 12 , 2025 | 10:20 PM
పెళ్లి కొడుకుపై దాడి చేసిన నిందితులను పొటోగ్రాఫర్ తన డ్రోన్‌తో ఛేజ్ చేసిన ఉదంతం మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లిలో వరుడిపై దాడి చేసి పారిపోతున్న నిందితులను ఓ వీడియోగ్రాఫర్ తన డ్రోన్‌తో వెండించిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అమరావతి జిల్లాలో సోమవారం జరిగిన ఓ పెళ్లివేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడిని సజల్ రామ్ సముద్రగా గుర్తించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెళ్లిలో డ్యాన్స్ చేసే సమయంలో తలెత్తిన వివాదం చివరకు కత్తిపోట్ల వరకూ వెళ్లిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు (Maharashtra Groom Attacked).
వేదికపై వరుడు సజల్ రామ్ సముద్రను రఘూ జితేంద్ర బక్షీ పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి మరో వ్యక్తితో కలిసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో పెళ్లి ఫొటోలు తీస్తున్న ఫొటోగ్రాఫర్ తన డ్రోన్‌తో నిందితులను రికార్డు చేయడం ప్రారంభించారు. బైక్‌పై పారిపోతున్న వారిని తన డ్రోన్‌తో వెంబడించారు. దాదాపు రెండు కిలోమీటర్ల పాటు వారిని వెంబడించారు. ఇక ఈ కేసులో ఈ డ్రోన్ ఫుటేజీనే కీలకంగా మారింది. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.