Time: సమయం గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - Apr 25 , 2025 | 09:38 PM
University of Surrey: గడిచిపోయినా.. గడుస్తున్నా.. గడవబోతున్నా.. ( భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు) కేవలం సమయాన్ని మాత్రమే సూచిస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు కొంత షాకింగ్‌గా అనిపించవచ్చు.
ఈ సృష్టిలోని ప్రతీ జీవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల ఆధారంగానే మనుగడ సాగిస్తుంది. జీవి పుట్టుక ఒక సమయం(భూతాకాలం)లో మొదలై.. మరో సమయం( భవిష్యత్ కాలం)లో ముగుస్తుంది. సమయానికి కాలానికి సంబంధం ఉన్నా.. రెండింటి అర్థం వేరు. సమయం నిర్దిష్టమైనది.. సమయాన్ని సూచించే చర్య కాలం. అంటే మనం ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవాల్సిన విషయం సమయం మాత్రమే. గడిచిపోయినా.. గడుస్తున్నా.. గడవబోతున్నా.. ( భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు) కేవలం సమయాన్ని మాత్రమే సూచిస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు కొంత షాకింగ్‌గా అనిపించవచ్చు.
మనకు ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారం.. సమయం ఒక క్రమంలో భూతాకాలం నుంచి భవిష్యత్ వైపు నడుస్తుంది. అదే ఒకే వైపుకు ముందుకు నడుస్తుంది. కానీ, యూనివర్శిటీ ఆఫ్ సుర్రే స్టడీ ప్రకారం మనం ఇన్ని రోజులు అనుకుంటున్నది తప్పు. క్వాంటమ్ లెవెల్‌లో సమయం ఒకే సారి ముందుకు, వెనక్కు నడుస్తుంది. అంటే భూతాకాలం నుంచి భవిష్యత్తుకు.. భవిష్యత్తు నుంచి భూతాకాలానికి ఒకే సారి ప్రయాణిస్తుంది. జర్నల్ సైంటిఫిక్ రిపోర్టులో ప్రచురితం అయిన వివరాల ప్రకారం.. కొన్ని క్వాంటమ్ సిస్టమ్స్ రెండు టైమ్ యారోలను కలిగి ఉంటాయి. ఒక యారో ముందు వైపుగా ప్రయాణిస్తుంది. మరో యారో వెనుక వైపుగా ప్రయాణిస్తుంది.
ఆ స్టడీ గురించి యూనివర్శిటీ ఆఫ్ సుర్రే శాస్త్ర వేత్తలు మాట్లాడుతూ.. ‘ మన సాధారణ అనుభవం ప్రకారం.. సమయం కేవలం ఒక వైపు మాత్రమే ప్రయాణిస్తుంది. కానీ, అందుకు వ్యతిరేకంగా కూడా సమయం ప్రయాణించే అవకాశం ఉంది. ఇప్పుడు పాలు టేబుల్ మీదపడ్డాయి అనుకోండి. ఆ పాలు టేబుల్ మొత్తం పరుచుకుంటాయి. దాన్ని బట్టి సమయం ముందుకు సాగుతోందని అర్థం అవుతుంది. సినిమాలో చూపించినట్లు దాన్ని వెనక్కు ప్లే చేస్తే.. టేబుల్‌పై ఉలికిపోయిన పాలు మళ్లీ గ్లాసులోకి వచ్చేస్తాయి. ప్రాథమిక స్థాయిలో.. భౌతిక శాస్త్ర నియమాలు పెండలాన్ని పోలి ఉంటాయి. అవి తిరిగి మార్చలేని ప్రక్రియలకు కారణం కావు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
CM Chandrababu: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కుటుంబానికి రూ.20,000..
Dry Fruits Health Benefits: మీరు డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..