Share News

CM Chandrababu: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కుటుంబానికి రూ.20,000..

ABN , Publish Date - Apr 25 , 2025 | 08:02 PM

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి రేపు శ్రీకారం చుట్టనుంది. ప్రజా సంక్షేమంలో భాగంగా సీఎం చంద్రబాబు..

CM Chandrababu: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కుటుంబానికి రూ.20,000..
Chandrababu

CM Chandrababu: ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తోన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ప్రజల సంక్షేమం కోసం కొత్త పథకాలను ముందుకు తీసుకోస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల మన్నన పొందుతుంది. అయితే, ఈ క్రమంలోనే కూటమి సర్కార్ రేపు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది.

శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు రేపు ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని ప్రారంభించనున్నారు. సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్ధిక సాయం అందించనున్నారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ. 20,000 ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా దాదాపు 1,29,178 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. ఇందుకోసం కూటమి ప్రభుత్వం రూ. 258 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Apr 25 , 2025 | 08:55 PM