Namma Filter Coffee Staff: ఎక్స్‌ట్రా కప్పులు ఇవ్వలేదని షాపు సిబ్బందిని చావగొట్టారు..
ABN , Publish Date - Jul 03 , 2025 | 01:31 PM
Namma Filter Coffee Staff: బెంగళూరులోని శేషాద్రిపురంలో ‘నమ్మ ఫిల్టర్ కాఫీ’ షాపు ఉంది. బుధవారం కొంతమంది మిత్రులు కాఫీ తాగడానికి ఆ షాపుకు వెళ్లారు. మూడు కాఫీలు ఆర్డర్ చేశారు. వారు అంతకంటే ఎక్కుమందే ఉన్నారు.
వన్ బై టు, వన్ బై త్రీ, టు బై ఫోర్.. ఫ్రెండ్స్‌తో కలిసి టీ తాగడానికి వెళ్లినపుడు ఆ పదాల్ని బాగా వాడుతుంటారు. ఒక కప్పు టీ కొని.. ఇద్దరు లేదా ముగ్గురు మిత్రులు షేర్ చేసుకుని తాగుతుంటారు. ఇందుకోసం షాపతడ్ని ఎక్స్ ట్రాగా ఖాళీ కప్పులు అడుగుతుంటారు. కొన్ని సార్లు షాపు వాళ్లు ఖాళీ కప్పులకు కూడా డబ్బులు అడుగుతుంటారు. అయితే, తాజాగా ఓ కాఫీ షాపులో ఎక్స్‌ట్రా కాఫీ కప్పుల కోసం గొడవ జరిగింది.
కొంతమంది మిత్రులు కలిసి కాఫీ షాపు సిబ్బందిని దారుణంగా కొట్టారు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులోని బుధవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని శేషాద్రిపురంలో ‘నమ్మ ఫిల్టర్ కాఫీ’ షాపు ఉంది. బుధవారం కొంతమంది మిత్రులు కాఫీ తాగడానికి ఆ షాపుకు వెళ్లారు. మూడు కాఫీలు ఆర్డర్ చేశారు. వారు అంతకంటే ఎక్కుమందే ఉన్నారు.
దీంతో ఎక్స్‌ట్రాగా ఖాళీ కప్పులు ఇవ్వమని అడిగారు. ఇందుకు కాఫీ షాపు సిబ్బంది ఒప్పుకోలేదు. ఇవ్వనని తేల్చి చెప్పాడు. దీంతో గొడవ మొదలైంది. అది చినికి చినికి గాలి వానలా తయారైంది. వారు అతడిపై దాడి చేశారు. దూరంగా ఈడ్చుకెళ్లి మరీ కొట్టారు. వారి దాడిలో కాఫీ షాపు సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం అతడు శేషాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇవి కూడా చదవండి
అరెస్టైనా అదే మాట.. స్టూడెంట్‌ని ప్రేమిస్తున్నానన్న టీచర్
ప్రాణం తీసిన జెనరేటర్.. నిద్రలోనే కన్నుమూసిన తండ్రీకొడుకులు