Share News

Viral Video: లోకల్ ట్రైన్‌లో దారుణం.. మహిళ అని కూడా చూడకుండా..

ABN , Publish Date - May 20 , 2025 | 04:40 PM

Viral Video: ఆ వ్యక్తికి, మహిళకు మధ్య సీటు విషయంలో గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలి వానలా మారింది. ఆ వ్యక్తి మహిళపై దాడికి దిగాడు. ఆమెను బాగా కొట్టాడు. అక్కడి వారు ఎంత ఆపినా ఆగలేదు. కోపంతో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.

Viral Video: లోకల్ ట్రైన్‌లో దారుణం.. మహిళ అని కూడా చూడకుండా..
Viral Video

బస్సుల్లో, రైళ్లలో సీట్ల కోసం గొడవపడ్డం అన్నది సర్వసాధారణ విషయం. కొన్ని సార్లు ఆడవాళ్లకు, మగవాళ్లకు మధ్య కూడా సీట్ల విషయంలో గొడవలు అవుతూ ఉంటాయి. ఎంత దారుణంగా తిట్టుకున్నా.. కొట్టుకునే వరకు వెళ్లే అవకాశం అత్యంత అరుదుగా ఉంటుంది. మగ వాళ్లు .. ఆడవాళ్ల మీద చెయ్యి చేసుకునే దుస్సాహసం చేయరు. కానీ, ఓ వ్యక్తి మాత్రం సీటు కోసం జరిగిన గొడవలో మహిళను దారుణంగా కొట్టాడు. ఈ సంఘటన ముంబైలోని లోకల్ ట్రైన్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.


ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ మహిళ సోమవారం సాయంత్రం లోకల్ ట్రైన్‌ ఎక్కింది. నేరుగా దివ్యాంగులకోసం కేటాయించిన రిజర్వ్డ్ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తికి .. ఈ మహిళకు సీటు విషయంలో గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలి వానలా తయారైంది. ఆ వ్యక్తి మహిళపై దాడికి దిగాడు. ఆమెను బాగా కొట్టాడు. అక్కడి వారు ఎంత ఆపినా ఆగలేదు. కోపంతో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.


అక్కడున్న తోటి మగాళ్లు ఎంతో కష్టం మీద అతడ్ని పక్కకు లాక్కుని వచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ ఓ ఆడ మనిషిపై అలా ఎలా దాడి చేస్తావ్. నువ్వసలు మనిషివేనా’.. ‘ మహిళపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. సీటు కోసం ఆమెను అంత దారుణంగా కొడతావా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సంఘటనపై రైల్వే అధికారులు ఇంకా స్పందించలేదు.


ఇవి కూడా చదవండి

Kanpur Wife: అల్లుడితో ఎఫైర్.. విషయం భర్తకు తెలిసిందని..

Bhopal Shocker: అమ్మ బాబోయ్.. 7 నెలల్లో 25 మంది మగాళ్లను పెళ్లి చేసుకుంది..

Updated Date - May 20 , 2025 | 04:52 PM