Newborns Crying Video: బిడ్డకు జన్మనిచ్చి తల్లి మరణం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో..
ABN , Publish Date - Nov 09 , 2025 | 07:18 AM
మహిళ బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు కోల్పోయింది. కళ్లు కూడా తెరవని ఆ బిడ్డ గుక్కపట్టి ఏడవ సాగింది. డాక్టర్లు ఆ బిడ్డ ముఖాన్ని తల్లి ముఖంపై పెట్టారు. 56 సెకన్ల ఆ వీడియో కంటతడి పెట్టిస్తోంది.
బిడ్డకు జన్మనివ్వటం అన్నది ఆశామాషీ విషయం కాదు. ఆడవారికి అది పునర్జన్మలాంటిది. ఆడవారు బిడ్డకు జన్మనివ్వటానికి చావు అంచుల వరకు వెళ్లి వస్తారు. తాము పడ్డకష్టాన్నంతా బిడ్డను చూసుకుని మరిచిపోతారు. అయితే, బిడ్డకు జన్మనిచ్చే ప్రయాణంలో కొన్నిసార్లు ప్రాణాలు సైతం పోగొట్టుకున్న వారు ఉన్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కూడా డాక్టర్లు మాత్రం ఈ మరణాలను ఆపలేకపోతున్నారు. తాజాగా, ఓ తల్లి తన బిడ్డను భూమ్మీదకు తెచ్చే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షలాహు అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో నవంబర్ 6వ తేదీన ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఇప్పటి వరకు ఆ వీడియోను కోటి మంది దాకా చూశారు. ఆ వీడియోలో ఏముందంటే.. మహిళ బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు కోల్పోయింది. కళ్లు కూడా తెరవని ఆ బిడ్డ గుక్కపట్టి ఏడవ సాగింది. డాక్టర్లు ఆ బిడ్డ ముఖాన్ని తల్లి ముఖంపై పెట్టారు. 56 సెకన్ల ఆ వీడియో కంటతడి పెట్టిస్తోంది. ఏ బిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదు అనిపించేలా ఉంది.
ఇక సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇలాంటి వీడియోలను చూసినపుడు మనసుకు ఎంతో బాధగా అనిపిస్తుంది. ఆ బిడ్డ కష్టం ఎవ్వరికీ రాకూడదు’..‘తల్లి లేని ఆ బిడ్డ కష్టం వర్ణణాతీతం. ఆ బాధ దేవుడికే తెలియాలి’..‘తల్లి కష్టం గురించి ఎవ్వరూ మాట్లాడరు. బిడ్డకు జన్మనివ్వడానికి తల్లులు ఎంత కష్టపడాలో ఈ వీడియోనే ప్రత్యక్ష ఉదాహరణ. కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోతాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో.. భారత్ పాక్ పోరు లేనట్టేనా..