Groom demands: నో కిస్.. నో హగ్.. పెళ్లికి వరుడు పెట్టిన పది కండిషన్లు ఏంటంటే..
ABN , Publish Date - Nov 08 , 2025 | 07:40 PM
భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం అంటే అంగరంగ వైభవంగా జరిగే వేడుక. కాలం గడుస్తున్న కొద్దీ ఆ వివాహ సంప్రదాయాలు మారుతూ వస్తున్నాయి. సోషల్ మీడియా యుగంలో పెళ్లికి అర్థమే మారిపోయింది. ప్రీ-వెడ్డింగ్ షూట్‌లు, వీడియోలు, సంగీత్‌లు, డ్యాన్స్‌లు.. ఇలా చాలా హంగామా ఉంటుంది.
భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం అంటే అంగరంగ వైభవంగా జరిగే వేడుక. కాలం గడుస్తున్న కొద్దీ ఆ వివాహ సంప్రదాయాలు మారుతూ వస్తున్నాయి. సోషల్ మీడియా యుగంలో పెళ్లికి అర్థమే మారిపోయింది. ప్రీ-వెడ్డింగ్ షూట్‌లు, వీడియోలు, సంగీత్‌లు, డ్యాన్స్‌లు.. ఇలా చాలా హంగామా ఉంటుంది. అయితే తాజాగా ఓ వరుడు తన పెళ్లి సందర్భంగా వధువు తరఫు వారికి కొన్ని కండిషన్లు పెట్టాడు (Indian wedding trends).
తన డిమాండ్‌లను ఒక కాగితం మీద రాసి తనకు కాబోయే మామగారికి ఇచ్చాడు (Traditional wedding). తాను పెట్టే పది కండిషన్లకు ఓకే అంటేనే పెళ్లి ఉంటుందని స్పష్టంగా చెప్పాడు. తనకు కట్నం అక్కర్లేదని, పెళ్లి మాత్రం ఆధునికంగా కాకుండా సాంప్రదాయం ప్రకారం జరగాలని తేల్చి చెప్పాడు. ఆ పది డిమాండ్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లి కొడుకు డిమాండ్‌లపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
వరుడి 10 డిమాండ్లు ఇవే..
ప్రీ-వెడ్డింగ్ షూట్ ఉండకూడదు.
వధువు లెహంగా కాదు, చీర కట్టుకోవాలి.
పెళ్లిగా భారీ శబ్దాలతో అసభ్యకరమైన పాటలు ఉండకూడదు. వాయిద్య సంగీతం మాత్రమే ప్లే చేయాలి.
వరమాల సమయంలో వధూవరులు మాత్రమే వేదికపై ఉండాలి.
వరమాల వేడుక సమయంలో వధూవరులను ఎవరూ ఎత్తడానికి అనుమతి లేదు.
పెళ్లి తరువాత వధూవరులను హగ్‌లు, కిస్‌లు ఇచ్చుకోవాలని ఎవరూ అడగకూడదు.
ఫొటోలు, వీడియోల కోసం పంతులుగారిని ఎవరూ అడ్డుకోకూడదు.
వేడుకకు అంతరాయం కలగకుండా ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీయాలి.
ఫొటోల కోసం విచిత్రమైన ఫోజులు ఇవ్వమని అడగకూడదు.
వివాహం పగటిపూట జరగాలి. వీడ్కోలు సాయంత్రం జరగాలి.
ఇవి కూడా చదవండి..
మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో పాము ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..
పక్షులు ఈమెతో మాట్లాడుతున్నాయ్.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న వీడియో..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..