Share News

Viral Reel: ఆడాళ్ల డ్రెస్సుల్లో పాడు డ్యాన్సులు.. పోలీస్ ఎదురుగానే..

ABN , Publish Date - Jul 26 , 2025 | 06:35 PM

Viral Reel: అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. ఆ వ్యక్తులు ఎవరో గుర్తించిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసులను కించపరిచే విధంగా.. అసభ్యకరంగా ఏది చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Viral Reel: ఆడాళ్ల డ్రెస్సుల్లో పాడు డ్యాన్సులు.. పోలీస్ ఎదురుగానే..
Viral Reel

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి కొంతమంది బరితెగిస్తున్నారు. నీఛానికి దిగజారుతున్నారు. తాజాగా, ఓ యువకుడు ఆడాళ్ల డ్రెస్ వేసుకుని పబ్లిక్‌లో డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోయాడు. ఆఖరికి పోలీస్ దగ్గర కూడా అసభ్యకరంగా డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వీడియోలో నీరజ్ అనే ఓ యువకుడు చీర కట్టుకున్నాడు. పక్కనే ఓ పోలీస్ నిల్చుని ఉన్నాడు. ఆ యువకుడు పోలీస్ చుట్టూ తిరుగుతూ.. ‘మై హు దుల్హన్ ఏక్ రాత్‌కీ’ అనే పాటకు డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు


ఆ పోలీస్ ఏమీ చేయలేక.. చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు. మరో వీడియోలో.. ‘సయ్యాజి దిల్‌వా మిలేంగే..’ అనే భోజ్‌పురి పాటకు డ్యాన్స్ చేశాడు. ఆ డ్యాన్స్ అసభ్యకరంగా ఉంది. ఆ యువకుడితో పాటు మరో యువకుడు, ఓ ఇద్దరు యువతులు కూడా డ్యాన్స్ చేశారు. నోయిడాలోని రాష్ట్రీయ దళిత్ ప్రేర్నా స్థల్ దగ్గర ఈ వీడియోలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. నీరజ్ పోలీస్‌ ముందు చేసిన డ్యాన్స్ వీడియో పోలీసు ఉన్నతాధి కారుల ద‌ృష్టికి వెళ్లింది. వీడియోపై అధికారులు సీరియస్ అయ్యారు.


సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. ఆ వ్యక్తులు ఎవరో గుర్తించిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. పోలీసులను కించపరిచే విధంగా.. అసభ్యకరంగా ఏది చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక, వైరల్‌గా మారిన వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు..‘అలా పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేసే వారిని పిచ్చాసుపత్రిలో చేర్పించాలి’..‘మీ దగ్గర మంచి కళ ఉంది. దాన్ని అలా నీఛంగా ప్రదర్శించకండి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

నీట మునిగిన మహా నగరం.. 20 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి

కింగ్‌డమ్ మూవీకి తిప్పలు.. తిరుపతిలో నిరసన సెగ

Updated Date - Jul 26 , 2025 | 09:59 PM