Share News

Viral proposal video: క్యూట్ ప్రపోజల్.. తన ప్రేయసికి ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో చూడండి..

ABN , Publish Date - Dec 01 , 2025 | 06:20 PM

తాజాగా ఓ వ్యక్తి తన ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేసిన తీరుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ ప్రపోజల్ చూసి ఆ అమ్మాయి చాలా సంతోష పడిపోయింది. వెంటనే అతడి ప్రేమను అంగీకరించింది.

Viral proposal video: క్యూట్ ప్రపోజల్.. తన ప్రేయసికి ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో చూడండి..
unique marriage proposal

సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి తన ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేసిన తీరుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (unique marriage proposal).


nehajain97 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి తెల్లవారుజామున క్యాబ్‌లో తన ప్రేయసి ఇంటికి వెళ్లాడు. అప్పటికే ఒక బ్యాండ్ బుక్ చేసి ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఉంచాడు. ఆ బ్యాండ్‌ను ఆ అమ్మాయి గదిలోకి తీసుకువెళ్లాడు. దీంతో ఆ అమ్మాయి మేల్కొంది. ఏమి జరుగుతోందో ఆమెకు మొదట అర్థం కాలేదు. బ్యాండ్ సంగీతం ప్లే చేస్తున్న సమయంలో ఆ వ్యక్తి తన జేబులో నుంచి ఉంగరం తీసుకొని ఆమెకు ప్రపోజ్ చేశాడు (man proposes uniquely).


ఆ ప్రపోజల్ చూసి ఆ అమ్మాయి చాలా సంతోష పడిపోయింది (romantic proposal moment). వెంటనే అతడి ప్రేమను అంగీకరించింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు కోట్ల మంది వీక్షించారు. దాదాపు 9.5 లక్షల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. 'సోదరా, నాకు ఇది చాలా నచ్చింది, దేవుడు నిన్ను దీవించుగాక' అని ఒకరు కామెంట్ చేశారు. ఇది క్యూట్ ప్రపోజల్ అని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

పాపం.. మృగరాజు.. అడవి గేదెపై దాడి చేస్తే ఏం జరిగిందో చూడండి..


మీ దృష్టి షార్ప్ అయితే.. ఈ ఫొటోలో తోడేలు ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 01 , 2025 | 06:20 PM