Viral Video: సింహంతోటే ఆటలా దూల తీరిందిగా..
ABN , Publish Date - May 24 , 2025 | 03:44 PM
Man Playing With Lion: అయినా అతడు ఆగలేదు. దాన్ని ఆటపట్టిస్తూనే ఉన్నాడు. అది తన పంజాతో అతడ్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. కొన్ని సార్లు దాని అటాక్ నుంచి చాలా నేర్పుగా తప్పించుకున్నాడు.
మన స్థాయిని బట్టి గొడవలు పెట్టుకోవటం గానీ, ఇతరుల్ని ఆటపట్టించటం గానీ చేయాలి. ఎందుకంటే.. అది బ్యాక్ ఫైర్ అయినప్పుడు దాని తాలూకా ప్రభావం మన మీద దారుణంగా ఉంటుంది. ఇద్దరు ఈక్వెల్స్ లేదా తక్కువ స్థాయి వాళ్లతో గొడవ జరిగినపుడు తీవ్రత తక్కువగా ఉంటుంది. మనుషుల గురించే ఇంతగా ఆలోచించినపుడు.. అడవి మృగాలతో పెట్టుకున్నపుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇదేమీ ఆలోచించినట్లు లేడు పాపం.. ఓ వ్యక్తి ఏకంగా సింహంతో కామెడీ చేశాడు. దాని మూతిపై వేలితో గిల్లుతూ ఆటపట్టించాడు.
అది ఊరుకుంటుందా.. తన పంజా విసిరింది. దీంతో అతడి తోలు కాగితంపై బ్లేడుతో కోసినట్లు అయింది. ఆ వ్యక్తి ఎవరు.. ఈ సంఘటన ఎప్పుడు.. ఎక్కడ.. జరిగిందన్న సమాచారం లేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోలో ఏముందంటే.. నీలిరంగు షర్టు ధరించిన ఓ వ్యక్తి సింహం ఉండే బోను దగ్గరకు వచ్చాడు. సింహంతో ఆటలు ఆడటం మొదలెట్టాడు. దాని ముక్కుపై వేలితో గిల్లటం మొదలెట్టాడు. అది కోపంతో గుర్రుమంటూ ఉంది.
అయినా అతడు ఆగలేదు. దాన్ని ఆటపట్టిస్తూనే ఉన్నాడు. అది తన పంజాతో అతడ్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. కొన్ని సార్లు దాని అటాక్ నుంచి చాలా నేర్పుగా తప్పించుకున్నాడు. అయితే, అతి ఎప్పటికైనా మంచిది కాదు అన్నట్లు.. చివరకు సింహం పంజాకు దొరికాడు. అది బ్లేడు లాంటి తన పదునైన గోర్లను అతడి చేతిలోకి దింపింది. అంతే.. చావు తప్పి కన్నులొట్టపోయినట్లు అయింది అతడి పరిస్థితి. దాన్నుంచి తప్పించుకుని చేయి చూసుకున్నాడు. అప్పటికే చర్మం రెండు అంగుళాల మేర చాలా లోతుగా తెగింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ వ్యక్తిపై మండిపడుతున్నారు. సింహంతో పొరపాటున కూడా ఆటలాడకూడదని హెచ్చరిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి .. సింహంతోటే ఆటలా దూల తీరిందిగా..
ఇవి కూడా చదవండి
Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ వదిలించుకోవడానికి 5 సింపుల్ చిట్కాలు..
Relationship Tips: ఈ కారణాల వల్లే భార్యలు భర్తలను మోసగిస్తారు..