Share News

Funny jugaad: ఇదెక్కడి టెక్నాలజీ నాయనా.. బైక్ మీద ఎలా వెళ్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:22 AM

ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే విచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది

Funny jugaad: ఇదెక్కడి టెక్నాలజీ నాయనా.. బైక్ మీద ఎలా వెళ్తున్నాడో చూడండి..
trending funny clip

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే విచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (cot on bike viral video).


meme__staaar అనే ఇన్‌‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెళ్తున్నారు. ఆ బైక్ వెనుక సీటుకు ఓ మంచం బిగించి ఉంది. ఒకరు బైక్ నడుపుతుంటే, మరొకరు మంచం మీద పడుకున్నారు. ఆ మంచానికి ఓ దోమతెరను కూడా కట్టారు. ఆ మంచం మీద పడుకున్న వ్యక్తి తన ఫోన్‌ను ఉపయోగిస్తూ రైడ్‌ను ఆస్వాదిస్తున్నాడు. బహుశా వారు లాంగ్ డ్రైవ్‌కు వెళ్తున్నట్టు ఉన్నారు (funny jugaad India).


వారిలో ఒకరు అలసిపోయినప్పుడు మంచం మీద విశ్రాంతి తీసుకోవచ్చు (man fixes cot to bike). అప్పుడు మరొకరు బైక్ నడుపుతారు. ఈ వింత ట్రిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది వీక్షించారు. 40 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడానికి ఉపయోగపడే బైక్ అని కొందరు కామెంట్లు చేశారు. ఈ టెక్నాలజీని చూసి అమెరికన్లు భయపడుతున్నారని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఇంత రిస్క్ ఎందుకు బ్రదర్.. బిజీ రోడ్డుపై స్కూటీ ఎలా నడుపుతున్నాడో చూడండి..

మీ బ్రెయిన్ స్పీడ్‌కు టెస్ట్.. ఈ ఫొటోలోని భిన్నమైన సంఖ్యలను 17 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 15 , 2025 | 11:22 AM