Share News

Bengaluru momo seller: రోడ్డు పక్కన స్టాల్.. లక్షల్లో సంపాదన.. నెలకు అతడి ఆదాయం ఎంతంటే..

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:55 AM

రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్స్ యజమానులు భారీగా సంపాదిస్తున్నారని తెలిపే పలు వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బెంగళూరుకు చెందిన ఓ ఫుడ్ స్టాల్ ఓనర్ నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే కళ్లు తేలెయ్యాల్సిందే.

Bengaluru momo seller: రోడ్డు పక్కన స్టాల్.. లక్షల్లో సంపాదన.. నెలకు అతడి ఆదాయం ఎంతంటే..
Bengaluru momo seller

మన దేశంలో ఏ నగరంలోనైనా రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్స్ కనబడుతుంటాయి. చాలా మంది ఆ స్టాల్స్‌లో ఫుడ్ తినేందుకు ఇష్టపడుతుంటారు. సాయంత్రం అయితే నగరాల్లోని రోడ్డు పక్కన చాలా ఫుడ్ స్టాల్స్ జనాలతో కిటకిటలాడుతుంటాయి. ఆ ఫుడ్ స్టాల్స్ యజమానులు భారీగా సంపాదిస్తున్నారని తెలిపే పలు వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బెంగళూరుకు చెందిన ఓ ఫుడ్ స్టాల్ ఓనర్ నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే కళ్లు తేలెయ్యాల్సిందే (Bengaluru street food news).


ఓ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ బెంగళూరులోని రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ దగ్గర ఒక రోజంతా గడిపి నెలవారీ ఆదాయాన్ని వెల్లడించాడు. ఈ వీడియోను @cassiusclydepereira అనే ఇన్‌‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఆ ఫుడ్ స్టాల్ ఓనర్ మోమోలు అమ్ముతుంటాడు. రోడ్డు పక్కన నడిపే ఆ ఫుడ్ స్టాల్ ఓనర్ ఒక్క రోజుకే లక్ష రూపాయలు సంపాదిస్తాడట. కంటెంట్ క్రియేటర్ వీడియో రూపొందించిన రోజున ఆ ఫుడ్ స్టాల్ ఓనర్ 950 ప్లేట్ల మోమోలు విక్రయించాడట. ఒక్కో ప్లేట్ ధర 110 రూపాయలు (momo business earnings).


ప్రతిరోజు ఆ స్టాల్ వద్ద దాదాపు అదే స్థాయిలో మోమోలు అమ్ముడవుతుంటాయట (momo seller income). అంటే ఆ ఫుడ్ స్టాల్ ఓనర్ సంపాదన రోజుకు లక్ష రూపాయల పైమాటే. అంటే నెలకు అతడి ఆదాయం దాదాపు రూ.30 లక్షలు. మనదేశంలో పెద్ద చదువులు చదువుకున్న చాలా మంది ఈ మోమో విక్రేత కంటే తక్కువే సంపాదిస్తున్నారని ఆ కంటెంట్ క్రియేటర్ అభిప్రాయపడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి..

ఇంత రిస్క్ ఎందుకు బ్రదర్.. బిజీ రోడ్డుపై స్కూటీ ఎలా నడుపుతున్నాడో చూడండి..

మీ బ్రెయిన్ స్పీడ్‌కు టెస్ట్.. ఈ ఫొటోలోని భిన్నమైన సంఖ్యలను 17 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 16 , 2025 | 02:54 PM