Share News

Man Act as a Tiger: పులివేషంలో మనిషి.. పసిగట్టిన పులి.. చివరకు.!

ABN , Publish Date - Nov 12 , 2025 | 03:13 PM

సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఒక్కొక్కరు ఒక్కో వింత ప్రయత్నం చేస్తుంటారు. అలా వైరల్ అయ్యేందుకు ఇటీవల ఓ మనిషి పులివేషం ధరించి.. ఏకంగా నిజమైన పులి వద్దకే వెళ్లాడు. చివరకు పరుగులు పెట్టాడు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే...

Man Act as a Tiger: పులివేషంలో మనిషి.. పసిగట్టిన  పులి.. చివరకు.!
Man dresses as Tiger

ఇంటర్నెట్ డెస్క్: సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యేందుకు మనిషి సాహసాలకు అంతేలేకుండా పోతోంది. ఇటీవల ఓ మనిషి పులివేషం ధరించి.. ఏకంగా పులులు ఉండే స్థావరానికే వెళ్లాడు. ఓ పులి అతని వద్దకు వచ్చి తన కాలిగోటితో అతడి తలపై తట్టింది. ఇంతలో ఆ వ్యక్తి మాస్క్‌ ఊడటంతో అతడి అసలు రూపం బయటపడింది. దడుసుకున్న అతడు వెంటనే పరుగులు తీశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


అసలేం జరిగిందంటే.?

అటవీ ప్రాంతంలో రెండు పులులు కూర్చుని ఉన్నాయి. పులి వేషధారణ ధరించిన ఓ వ్యక్తి మెల్లగా వాటి వద్దకు వెళ్లేందుకు యత్నిస్తాడు. ఇది గమనించిన ఓ పులి మెల్లగా అతడి వైపునకు వస్తుంది. ఇంతలో పులికి అనుమానం వచ్చిందో ఏమో కానీ.. అతడివంక అలా చూసి తన కాలిగోటితో టక్కున తలపై తట్టింది. దీంతో ఆ వ్యక్తి ముఖానికి వేసుకున్న మాస్క్ పక్కకుపోతుంది. భయపడిన అతడు వెంటనే కాలికి బుద్ధిచెప్పాడు. వెంబడించిన పులి.. కాసేపు అతడివైపు పరుగెత్తి.. ఆ తర్వాత ఆగిపోతుంది. దీంతో అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న అటవీ వాతావరణం ఒక్కసారిగా హాస్యాస్పదంగా మారింది.


చూసేవారికి సరాదాగా నవ్వులు తెప్పిస్తున్న ఈ వీడియోను @naivememe అనే యూజర్ తన 'X' ఖాతాలో పోస్ట్ చేశారు. ఒక్కరోజు వ్యవధిలోనే 1.3 మిలియన్ వ్యూస్ వచ్చాయ్. 11వేల లైక్స్ రావడంతో పాటు పలు ఫన్నీ కామెంట్లూ దర్శమిస్తున్నాయ్. ఈ వీడియోను పలువురు పదే పదే షేర్ చేస్తూ తమ మిత్రులతో దీని గురించి చర్చించుకుంటున్నారు.


ఇదీ చదవండి:

కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు

కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..

Updated Date - Nov 12 , 2025 | 03:27 PM