Share News

Full-time girlfriend job: ఫుల్‌టైమ్ గర్ల్ ఫ్రెండ్ జాబ్.. ఎంత మంది అప్లై చేశారంటే..

ABN , Publish Date - Dec 16 , 2025 | 06:16 PM

మన దేశంలో ప్రస్తుతం లెక్కలేనన్ని డేటింగ్ యాప్‌లు ఉన్నాయి. వాటన్నింటినీ దాటుకుని ఇప్పుడు కొంతమంది లింక్డిన్‌ను కూడా డేటింగ్ యాప్ తరహాలో ఉపయోగిస్తున్నారు. తాజాగా గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన యాడ్ చాలా మందికి షాక్ కలిగిస్తోంది.

Full-time girlfriend job: ఫుల్‌టైమ్ గర్ల్ ఫ్రెండ్ జాబ్.. ఎంత మంది అప్లై చేశారంటే..
LinkedIn viral job post

మన దేశంలో ప్రస్తుతం లెక్కలేనన్ని డేటింగ్ యాప్‌లు ఉన్నాయి. వాటన్నింటినీ దాటుకుని ఇప్పుడు కొంతమంది లింక్డిన్‌ను కూడా డేటింగ్ యాప్ తరహాలో ఉపయోగిస్తున్నారు. తాజాగా గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన యాడ్ చాలా మందికి షాక్ కలిగిస్తోంది. తన వద్ద ఫుల్ టైమ్ గర్ల్‌ఫ్రెండ్ జాబ్ ఖాళీగా ఉందని దినేష్ అనే వ్యక్తి లింక్డిన్‌లో ఓ యాడ్ పోస్ట్ చేశాడు. తనకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండే అమ్మాయికి ఉండాల్సిన అర్హతలు, బాధ్యతలు, లక్షణాలను కూడా అతడు పంచుకున్నాడు (LinkedIn viral job post).


దినేష్ అనే వ్యక్తి గతంలో టెక్ మహీంద్రా ఐటీ కంపెనీలో సీనియర్ అసోసియేట్ పదవిలో ఉన్నాడు. హర్యానాలోని గురుగ్రామ్‌లో నివసించే 'ఫుల్ టైమ్ హైబ్రిడ్ గర్ల్‌ఫ్రెండ్' కోసం చూస్తున్నానని దినేష్ స్పష్టంగా తన యాడ్‌లో పేర్కొన్నాడు. ఈ గర్ల్‌ఫ్రెండ్ జాబ్ ప్రకటనలో పేర్కొన్న అర్హతలు ఓ కార్పొరేట్ ఉద్యోగానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ కంటే తక్కువ కాదు. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటంటే.. అభ్యర్థి బలమైన భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అర్థవంతమైన సంభాషణల్లో పాల్గొనాలి. అన్ని పరిస్థితులలోనూ మద్దతుగా ఉండాలి (LinkedIn controversy).

girl-friend.jpg


అంతే కాదు.. అభ్యర్థికి చురుకైన కమ్యూనికేషన్, గౌరవం, అవగాహన, సానుభూతి, ఎదుటి వారు మాట్లాడుతున్నప్పుడు వినే నైపుణ్యాలు కూడా ఉండాలట (unusual job listing). అలాగే ఈ పాత్రకు సెన్స్ ఆఫ్ హ్యూమర్, దయ, సానుకూల మనస్తత్వం చాలా అవసరమని దినేష్ పేర్కొన్నాడు. ఈ జాబ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది ఈ ఉద్యోగానికి జీతమెంత అని కూడా ప్రశ్నించారు. ఆశ్చర్యకరంగా 26 మంది ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో దినేష్ తరువాత దరఖాస్తులను స్వీకరించడం ఆపేశాడు.


ఇవి కూడా చదవండి..

కుప్పకూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం.. అసలేం జరిగిందంటే..


ఈ రైతు తన భార్య కోసం వెతుక్కుంటున్నాడు.. ఎక్కడుందో కనిపెట్టండి..

Updated Date - Dec 16 , 2025 | 07:04 PM